రైతులకు మేలు చేసే వయ్యారి భామ మళ్లీ దర్శనం..!

Updated on: Jun 14, 2026 | 4:46 PM

ఖమ్మం జిల్లా పులిగుండాల ఎకో టూరిజం ప్రాంతంలో అరుదైన ‘ఇండియన్ గ్రాస్ మాంటిస్’ గొల్లభామ మళ్లీ కనిపించడం ప్రకృతి ప్రేమికులను ఆనందానికి గురిచేసింది. ‘వయ్యారి భామ’గా పిలిచే ఈ మిత్ర కీటకం పంటలకు హాని చేసే పురుగులను ఆహారంగా తీసుకుంటూ రైతులకు సహజసిద్ధ రక్షకుడిగా పనిచేస్తుంది. దీని పునరాగమనం పర్యావరణ సమతుల్యత మెరుగుపడుతున్నదనే సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.

దశాబ్దాల కాలంగా కనుమరుగైపోయిందనుకున్న ఓ అరుదైన కీటకం.. తొలకరి వర్షాల వేళ మళ్లీ అడవుల్లో ప్రత్యక్షమై ప్రకృతి ప్రేమికులను ఆశ్చర్యపరుస్తోంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ప్రసిద్ధ ‘పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్ట్’ పరిధిలో అరుదైన ‘ఇండియన్ గ్రాస్ మాంటిస్’ అనే గొల్లభామ పర్యాటకుల కంటపడింది. సత్తుపల్లికి చెందిన ఒక పర్యాటకుడు అడవిలోని వెదురు చెట్లలో కలిసిపోయి ఉన్న ఈ వింత కీటకాన్ని గుర్తించారు. దీని పొడవాటి ఆకారం, ప్రత్యేకమైన నడక కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని ‘వయ్యారి భామ’ అని కూడా పిలుస్తారు. గడ్డి మైదానాలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా నివసిస్తాయి.ఈ గొల్లభామ కేవలం చూడటానికి అందంగా ఉండటమే కాదు, మన రైతులకు మేలు చేసే ఒక గొప్ప ‘మిత్ర కీటకం’. పంటలకు తీవ్ర నష్టం కలిగించే రకరకాల పురుగులు, హానికారక కీటకాలను ఇది ఆహారంగా తీసుకుంటుంది. తద్వారా ఎలాంటి రసాయన మందులు వాడకుండానే సహజ సిద్ధంగా కీటకాలను నియంత్రిస్తూ పంటలను రక్షిస్తుంది. రసాయన ఎరువుల వాడకం వల్ల కాలక్రమేణా అంతరించిపోతున్న ఇలాంటి మిత్ర కీటకాలు.. మళ్లీ పులిగుండాల అటవీ ప్రాంతంలో కనిపించడం పర్యావరణ సమతుల్యతకు శుభసూచకమని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడిసముద్రంలో టైం బాంబ్..భారత నేవీ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్!

ఈ శుక్రవారం OTTల్లో సైన్మా జాతర.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్‌కు..

Vadde Naveen: బన్నీ ఎదుగుదల.. నన్ను ఆశ్చర్యపరిచింది

Raghava Lawrence: ‘రాజకీయాల్లోకి రావాలా వద్దా?’ ఫ్యాన్స్‌కి లారెన్స్ సూటి ప్రశ్న

Sing Geetham Review: మాటలు లేని పాటల ప్రయోగం హిట్టా..? ఫట్టా..?

Follow Us