Steriods: కండల తిరిగిన బాడీ మోజులో స్టెరాయిడ్స్.. భాగ్యనగరంలో విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ ఇంజక్షన్స్..
మహానగరంలో మత్తుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంత నిఘా పెట్టినా సరే ఎక్కడో అక్కడ డ్రగ్ మాఫియా ఉనికి హడలెత్తిస్తోంది. మరోవైపు లేటెస్ట్‌గా మరో బేషరమ్ వ్యవహారం సంచలనం రేపింది.
ఇప్పుడు అంతా కండల క్రేజ్. సిక్స్‌ప్యాక్ మోజుతో యువత జిమ్‌లా బాటపడుతోంది. జిమ్‌లకి వెళ్లడం తప్పుకాదు.. కానీ ట్రైనర్ పర్యవేక్షణ లేకుండా ఓవర్ ఎక్సర్‌సైజ్ చేస్తే మొదటికే మోసం. ఐతే ఇప్పుడు మ్యాటర్ ఇది కాదు.. ఈ కండల షోకుతో యువత ఇప్పుడు ఏకంగా స్టెరాయిడ్స్ వాడేస్తున్నారు. బాడీని బంతిలా తిప్పేయాలనే మోజులో హైదరాబాద్ సిటీలోని అనేక జిమ్‌లో యువత స్టెరాయిడ్స్ వాడుతున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యం కన్నా హీ మ్యాన్‌లా కన్పించాలనే యావ..యువతను స్టెరాయిడ్స్ వైపు మళ్లిస్తోంది. మజిల్స్ మేనియాతో యువత గుండెపోటును కొని తెచ్చుకుంటున్నారు. ట్రైనర్స్ పర్యవేక్షణ లేకుండా అతి వ్యాయమం..తక్కువ టైమ్‌లో సల్మాన్‌ఖాన్ అయిపోవాలనే తపనతో స్టెరాయిడ్స్ వాడ్డం.. ఈ రెండూ ప్రజెంట్‌గా డేంజర్ సైరన్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఇదే అదనుగా కండలు పెంచాలనే తపనతో జిమ్ బాటపడుతున్న వాళ్లను టార్గెట్ చేస్తూ డ్రగ్ మాఫియా పంజా విసురుతోంది. డ్రగ్ దందాపై ఉక్కుపాదం మోపిన హైదరాబాద్ పోలీసులు..లేటెస్ట్‌గా స్టెరాయిడ్ రాకెట్‌కు బ్రేక్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..