Viral Video: మాతోనే గేమ్సా.! కుక్కను మింగేయాలనుకున్న కొండచిలువకు చుక్కలు చూపించారు.. వైరల్ వీడియో!

Viral Video: సరీసృపాలలో కొండచిలువలు అత్యంత ప్రమాదకరమైనవి. చిరుత, సింహం(Lion), పులి లాంటి క్రూర జంతువులు కూడా వీటిని వేటాడటానికి జంకుతాయి..

Viral Video: మాతోనే గేమ్సా.! కుక్కను మింగేయాలనుకున్న కొండచిలువకు చుక్కలు చూపించారు.. వైరల్ వీడియో!
Python

Updated on: Jan 25, 2022 | 4:33 PM

సరీసృపాలలో కొండచిలువలు అత్యంత ప్రమాదకరమైనవి. చిరుత, సింహం(Lion), పులి లాంటి క్రూర జంతువులు కూడా వీటిని వేటాడటానికి జంకుతాయి. కుక్కలను, పిల్లులను.. ఏకంగా మనుషులను సైతం కొండచిలువలు(Python) సజీవంగా మింగేస్తాయి. తాజాగా కొండచిలువ వేటకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా ఒక క్షణం ఆశ్చర్యపోతారు.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే! అంత ఈజీ కాదండోయ్.!

వైరల్ వీడియో ప్రకారం.. ఓ కుక్క కొండచిలువకు ఎరగా చిక్కినట్లు మీరు చూడవచ్చు. ఆ కుక్కను కొండచిలువ అమాంతం చుట్టేసి సజీవంగా మింగేందుకు సిద్దంగా ఉంటుంది. కొండచిలువ నుంచి ఎటూ తప్పించుకునే మార్గం లేక కుక్క నిస్సహాయంగా కనిపిస్తుంది. అయితే అక్కడే ఉన్న కొంతమంది పిల్లలు ఈ దృశ్యాన్ని చూసి కుక్క ప్రాణాలను కాపాడేందుకు పరుగులు తీస్తారు.

Also Read: Dragon Fruit: ఈ 3 వ్యాధులను దూరం చేసే దివ్య ఔషధం.. తింటే తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

ఓ పిల్లాడు కర్రను కొండచిలువ నోటికి అడ్డం పెట్టి దాన్ని పట్టుకోగా.. మరో ఇద్దరు పిల్లలు కుక్క శరీరం చుట్టూ చుట్టుకున్న కొండచిలువను అతి కష్టం మీద లాగుతారు. చివరికి ‘బ్రతుకు జీవుడా’ అంటూ కుక్క.. కొండచిలువ నుంచి తప్పించుకుంటుంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

కాగా, ఈ వీడియోను ‘Animal_World’ అనే ట్విట్టర్ పేజీ అప్‌లోడ్ చేయగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. చాలామంది వ్యూయర్స్ ఆ పిల్లలు చూపించిన ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

Also Read:  ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వం సిద్దం! రెండ్రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం!!

Loading...
Unable to load recommendations.
Follow Us