ఘోర రోడ్డు ప్రమాదం.. తాను చనిపోతూ కూడా బిడ్డకు జన్మనిచ్చింది
ఉత్తరప్రదేశ్‌లో అద్భుత ఘటన జరిగింది. వాస్తవానికి ఇది విషాద సంఘటన. చెడులోనూ మంచిని వెతుక్కోవడమే మనిషి లక్షణం.. ప్రమాదవశాత్తు లారీ కింద పడి నిండు గర్భిణి మృతి చెందింది.
ఉత్తరప్రదేశ్‌లో అద్భుత ఘటన జరిగింది. వాస్తవానికి ఇది విషాద సంఘటన. చెడులోనూ మంచిని వెతుక్కోవడమే మనిషి లక్షణం.. ప్రమాదవశాత్తు లారీ కింద పడి నిండు గర్భిణి మృతి చెందింది. కానీ తాను పోతూ.. ఇన్నాళ్లూ తన కడుపులో ప్రాణం పోసుకున్న పసిపాపను సురక్షితంగా ఈ భూమిపైన విడిచి తాను అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఆగ్రాకు చెందిన కామిని అనే యువతి 8 నెలల గర్భవతి. కాన్పు కోసం భర్తతో కలిసి బైక్‌పైన తన పుట్టింటికి వెళ్తోంది. ఈ క్రమంలో ఫిరోజాబాద్ జిల్లాలో బర్తర గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపు తప్పాడు. ఈ క్రమంలో బైకును సడన్ బ్రేక్ వేయడంతో బైక్‌పై కూర్చున్న అతని భార్య ఎగిరి రోడ్డుపైన పడింది. అదే సమయంలో వేగంగా వస్తున్న లారీ అమెపైనుంచి వెళ్లిపోయింది. ఈప్రమాదంలో కామిని శరీరం నుజ్జ నుజ్జు అయిపోవడంతో..ఆమె పొట్టనుంచి ఆడ శిశువు సురక్షితంగా బయటపడింది. ఆ శిశువును వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా శిశువుకు ప్రమాదమేమీ లేదని, ఆరోగ్యంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో శిశువు తండ్రి కూడా సురక్షితంగానే బయటపడ్డాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడతామని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Videos: సూపర్ హీరో.. రెప్పపాటులో అమ్మాయిని ఎలా కాపాడాడో చూడండి..
వామ్మో అది టీ స్టాల్ కాదు.. లోపలి సీన్ చూసి పోలీసులు షాక్
Death-Pool: సముద్రం దిగువన మృతకొలను !! ఇందులోకి పోయిన జీవి తిరిగిరాదు
Viral Video: ఏంటి బాస్ ఇతని టాలెంట్.. డాన్స్ చూస్తే.. వారెవ్వా.. ప్రభుదేవా అంటారు
TOP 9 ET News: వైరల్ గా బన్నీ పుష్ప 2 లుక్.. కదిలిస్తున్న శ్రావణ బార్గవి మెసేజ్