Fighting in live debate video: ఓర్నీ…లైవ్ డిబేట్‌లోనే కుమ్మేసుకున్నారు..! సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

Updated on: Feb 15, 2022 | 6:00 PM

ఓ టీవీ ఛానెల్ లైవ్ డిబేట్ నిర్వహించింది. ఏదో అంశంపై సీరియస్‌గానే చర్చ సాగిస్తోంది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు.. తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ఈ క్రమంలోనే వక్తల మధ్య బేధాబిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. మాటలు కోటలుదు దాటాయి.


Fighting in live debate video: ఓ టీవీ ఛానెల్ లైవ్ డిబేట్ నిర్వహించింది. ఏదో అంశంపై సీరియస్‌గానే చర్చ సాగిస్తోంది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు.. తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ఈ క్రమంలోనే వక్తల మధ్య బేధాబిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. మాటలు కోటలుదు దాటాయి. చివరికి ఒకరిపై మరొకరు పరస్పరం భౌతిక దాడులకు దిగారు. లైవ్ నడుస్తుండగానే.. ఇద్దరు వక్తలు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. గల్లాలు పట్టుకుని గుంజుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. మరో వక్త, యాంకర్ వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారిద్దరూ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఓ రేంజ్‌లో దెబ్బలాడుకున్నారు. లైవ్ డిబేట్ కావడంతో.. ఇదంతా టీవీలో ప్రసారం అయ్యింది. కాగా, దీనికి సంబంధించిన వీడియోను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు అనుకుంటూ..నెటిజన్లు ఫన్నీ సెటైర్లు వేస్తూ.. విమర్శలు కురిపిస్తున్నారు. ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు స్వీయనియంత్రణ అవసరం అని, అర్ధవంతమైన చర్చ చేయాలని హితవుచెబుతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Ranveer Singh: అమ్మాయిల కలల రాకుమారుడు.. నెట్టింట వైరల్ అవుతోన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఫోటోలు.

Krithi shetty Rare and childhood Photos: బేబమ్మ అరుదైన ఫొటోస్ కలెక్షన్.. ఈ రేంజ్ ‘కృతి శెట్టి’ ని ఉహించి ఉండరు…(ఫొటోస్)

Hero Venu Reentry: టాలెంటెడ్ హీరో రీఎంట్రీ.. ఇంతకాలం ఎం అయ్యింది వేణుకి..? రవితేజ మూవీలో కీలకపాత్రలో..వీడియో

Kim Jong un wife: సినిమా థియేటర్‌కు వెళ్లిన కిమ్‌ దంపతులు.! కెమెరాలో వీడియో తీసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న నెటిజన్లు..(వీడియో)