మెరుపువేగమంటే ఇదే.. వ్యక్తి స్కిల్స్‌ చూసి కస్టమర్లు షాక్‌

మెరుపువేగమంటే ఇదే.. వ్యక్తి స్కిల్స్‌ చూసి కస్టమర్లు షాక్‌

Phani CH

|

Updated on: Apr 19, 2023 | 9:40 AM

సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టు... ఏదైనా ఒక పనిని సాధన చేస్తే చేయగా చేయగా అది అభ్యాసమైపోతుంది. కొన్నాళ్లకి తాము చేసే పనిలో నిష్ణాతులైపోతారు. ఇదిగో ఇక్కడ ఓ వ్యక్తిని చూస్తే అదే అంటారు. ఓ ఫార్మసీ షాపులో బిల్లుల చెల్లింపుల వివరాలు కంప్యూటర్‌లో..

సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టు… ఏదైనా ఒక పనిని సాధన చేస్తే చేయగా చేయగా అది అభ్యాసమైపోతుంది. కొన్నాళ్లకి తాము చేసే పనిలో నిష్ణాతులైపోతారు. ఇదిగో ఇక్కడ ఓ వ్యక్తిని చూస్తే అదే అంటారు. ఓ ఫార్మసీ షాపులో బిల్లుల చెల్లింపుల వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేసే వ్యక్తి పనితనాన్ని చూసి నెటిజన్లు ‘వావ్‌..’ అనకుండా ఉండలేకపోతున్నారు. ఈ వీడియోలో బిల్లింగ్ కౌంటర్‌లో ఫార్మసీ సిబ్బంది కస్టమర్లకు మెడిసిన్‌ ఇస్తున్నారు. వారిలో ఓ వ్యక్తి మందుల వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేస్తున్నాడు. ఇక్కడే అందరి దృష్టిని అతను ఆకర్షించాడు. కస్టమర్లతో బిజీగా ఉన్న ఫార్మసీ షాపులో రిసెప్షనిస్ట్ కస్టమర్‌ల బిల్లింగ్ వివరాలను కనీసం కంప్యూటర్‌ వైపు చూడకుండానే క్షణాల్లో సిస్టమ్‌లో నమోదు చేసి బిల్లింగ్‌ పూర్తి చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘ఇతను ఇండియాలో బిజీగా ఉన్న ఫార్మసీలో పనిచేస్తున్న రిసెప్షనిస్ట్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. లక్షమందికి పైగా లైక్‌ చేశారు. అంతేకాదు ఆ వ్యక్తి నైపుణ్యానికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాంసాహారంపై నిషేధం విధించిన తొలి దేశం !!

రిసెప్షన్‌లోనే వధువు చెంప పగులగొట్టిన వరుడు.. అతిథులంతా షాక్ !!

పిల్లలు ఐస్ క్రీం అడగ్గానే కొనిచ్చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..

అరుదైన కోతులు చైనాకు తరలింపు.. అందుకేనా ??

ఇద్దరు హీరోల ముద్దుల హీరోయిన్‌.. తను ఎవరో తెలుసా ??

 

 

Published on: Apr 19, 2023 09:40 AM