హే కోతి లెవ్! అది బండరాయి కాదే.. బట్టతల.. దిగు.. దిగు

Updated on: Nov 10, 2025 | 5:07 PM

వనాల్లో బోరు కొట్టి జనాల్లోకి వస్తున్న వానరాలు ఇటీవల మనుషులపై దాడి చేస్తుండగా, పెద్దపల్లి సుల్తానాబాద్‌లో ఒక కోతి మాత్రం మనుషులతో స్నేహాన్ని కోరుకుంది. అనుమాల బుచ్చయ్య బట్టతలపై కూర్చుని భయాన్ని పోగొట్టింది. ఎలాంటి హానీ చేయకుండా, కొంతసేపు హాయిగా ఉండి వెళ్ళిపోయింది. ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది.

వనాల్లో తిరిగీ తిరిగీ బోరు కొట్టినట్టుంది.. వానరాలు జనాల్లోకి వస్తున్నాయి. చెట్లకొమ్మలను పట్టుకొని ఎంతసేపు వేళాడతాం అనుకున్నాయో ఏమో ఇటీవల మనుషుల తలలపై కూర్చుంటున్నాయి. బట్టతల కనపడగానే బండ భలే నున్నగా ఉందనుకుంటున్నాయో ఏమో నేరుగా వెళ్లి తలపై కూర్చుంటున్నాయి. ఇటీవల ఓ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన కోతి అక్కడి ఉద్యోగి భుజంపై కూర్చుని హాయిగా నిద్రపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. తాజాగా అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో వానరాలు మనుషులపై దాడి చేసి గాయపరుస్తుంటే ఓ కోతిమాత్రం మనుషులతో స్నేహాన్ని కోరుకుంటోంది. సుల్తానాబాద్ లోని గాంధీ నగర్ కు చెందిన అనుమాల బుచ్చయ్య అనే వ్యక్తి ఆ కాలనీలో ఓ చెట్టుకింద కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఇంతలో అక్కడే పక్కన చెట్టుమీద ఉన్న కోతి ఒక్కసారిగా వచ్చి బుచ్చయ్య బట్టతలపై ఎక్కి కూర్చుంది. దీంతో భయాందోళనకు గురయ్యాడు బుచ్చయ్య. స్థానికులు కూడా భయంతో వణికిపోయారు, కానీ ఆ కోతి మాత్రం అతనికి ఎలాంటి హానీ తలపెట్టలేదు. భయపడకు మిత్రమా.. కాసేపు కూర్చొని వెళ్లిపోతాను అన్నట్టు.. బట్టతలపైనుంచి జారిపోతున్నా.. సర్దుకుని కూర్చుంటుంది తప్ప దిగడంలేదు. ఏం చేయాలో తెలియక..ఏమీ చెయ్యలేక బుచ్చయ్య అలాగే కూర్చుండిపోయారు. కొద్దిసేపటి వానరం సరే బాస్‌.. నేను వెళ్తాను.. అన్నట్టుగా అతని తలపైనుంచి దిగి తన దారిన వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ సారి బైక్ మీద కాదు.. ఆటోలోనే రచ్చ రచ్చ చేసిన జంట..

పాలు తెస్తానని వెళ్లి.. డ్యామ్‌లో

రచ్చ రచ్చగా మిస్ యూనివర్స్‌ భామల వాకౌట్‌తో షాక్‌

అవిభక్త కవల పాములను చూశారా ??

భారత్‌లో ఆమె ఫొటోతో నకిలీ ఓట్లు ?? లారిస్సా ఏమంది అంటే