Humanity Video: నడిరోడ్డుపై హఠాత్తుగా పడిపోయిన వ్యక్తి.. పరుగెత్తుకొచ్చిన జనం.. చివరికి..
అసలే ఎండాకాలం. బానుడు భగభగమంటున్నాడు. దాంతో కొందరు వడదెబ్బకు గురవుతున్నారు. తాజాగా భాగ్యనగరంలో అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తి హఠాత్తుగా కింద పడిపోయాడు.
అసలే ఎండాకాలం. బానుడు భగభగమంటున్నాడు. దాంతో కొందరు వడదెబ్బకు గురవుతున్నారు. తాజాగా భాగ్యనగరంలో అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తి హఠాత్తుగా కింద పడిపోయాడు. నగరంలో ఇది కామనే అనుకుని చాలామంది పక్కనుంచి వెళ్లిపోయారు. కానీ కొందరు అలా కాదు. కళ్లెదుట ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించకుండా ఉండలేరు. ఇక్కడ కూడా అదే జరిగింది. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు కొందరు ఆగిపోయారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి పడిపోయిన వ్యక్తిని పైకి లేపారు. అతడికి సపర్యలు చేసి అతనికి మెలకువ వచ్చే వరకు అక్కడే వున్నారు. మంచినీళ్ళు తాగించారు. అతడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతే కాదు అతనికి కావలసిన డబ్బులు కూడా ఇచ్చారు .హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటనను ఎవరో వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టారు. వాహనదారులు చూపించిన మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఎండాకాలంలో ఇలాంటివి జరిగితే వెంటనే స్పందించండి. అలాంటివారిలో మన ఆత్మీయులు కూడా వుండవచ్చు. రోడ్డుమీద వెళుతున్నవారు కాపాడకపోతే కొంతమంది ప్రాణాలు పోవచ్చు. గోల్డెన్ అవర్ అని ఒకటుంటుంది. ఆ గోల్డెన్ అవర్ లో సాయం చేస్తే వడదెబ్బ తగిలినవారు కోలుకుంటారు. గుండెనొప్పి వచ్చిన వారు ప్రాణాపాయం నుంచి బయటపడతారు. అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..