గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్క.. పాపం చివరకు ??
అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది అని నానుడి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఓ సంఘటన చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లాలో చికెన్ కూర తింటూ ఓ వృద్ధుడు మరణించిన సంఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది.
అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది అని నానుడి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఓ సంఘటన చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లాలో చికెన్ కూర తింటూ ఓ వృద్ధుడు మరణించిన సంఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది. కొత్తగూడ మండలం కోనాపురం గ్రామానికి చెందిన.. ముత్తయ్యకు.. చికెన్ అంటే ఎంతో ఇష్టం. దాంతో ఇంట్లో చికెన్ కూర వండటంతో.. హ్యాపీగా అన్నం తిందామని గిన్నెముందు కూర్చున్నాడు. అంతే ముద్ద నోట్లో పెట్టుకోగానే.. ముక్క గొంతులోకి జారిపోయింది. అక్కడే ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అది లోపలికి వెళ్లలేదు.. బయటకు రాలేదు. దాంతో ఊపిరాడక కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.. ఆ కుటుంబం. ఈ ఘటనపై వైద్యనిపుణుల వివరణ ఏంటంటే..సాధారణంగా మనం ముక్కు నుంచి పీల్చుకునే గాలి, నోటి నుంచి తీసుకునే ఆహారం కలిసే చోటు ఒకటి ఉంటుంది. మింగిన ఆహారం అన్నవాహికకు వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పొరపాటున తినే ఆహార పదార్థాలు శ్వాస నాళంలోకి వెళ్తుంటాయి. అలాంటి సమయాల్లోనే సమస్య ఏర్పడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. ఇదెక్కడి వైద్యం.. దెబ్బ తగిలి ఆస్పత్రికి వెళ్తే.. డాక్టర్ చేసిన వింత పనికి అంతా షాక్
దెయ్యం కాళ్లతో గిన్నిస్ రికార్డ్ !! వీడియో చూస్తే షాకే
సూపర్ డాడ్.. పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఆ తండ్రి ఏం చేశాడంటే ??
మెక్‌డొనాల్డ్స్‌పై రూ.5 కోట్ల జరిమానా విధించిన కోర్టు !! ఎందుకో తెలుసా ??
తీవ్రమైన దగ్గుతో అస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసిన డాక్టర్‌కి షాక్ !!