Scholarship: విద్యార్థులకు గుడ్ న్యూస్ రూ.10 వేల స్కాలర్ షిప్.! రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.
డిగ్రీ, పీజీ చదువుతున్న పేద విద్యార్థుల కోసం ఒడిశా ప్రభుత్వం కొత్త స్కాలర్‌షిప్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద అబ్బాయిలకు ఏటా 9 వేల రూపాయలు, విద్యార్థినులకు 10వేలు రూపాయలు అందించనుంది. జజ్‌పుర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎస్‌టీ ఛైర్‌పర్సన్ వీకే పాండియన్ ఈ విషయాన్ని తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పారు.
డిగ్రీ, పీజీ చదువుతున్న పేద విద్యార్థుల కోసం ఒడిశా ప్రభుత్వం కొత్త స్కాలర్‌షిప్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద అబ్బాయిలకు ఏటా 9 వేల రూపాయలు, విద్యార్థినులకు 10వేలు రూపాయలు అందించనుంది. జజ్‌పుర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎస్‌టీ ఛైర్‌పర్సన్ వీకే పాండియన్ ఈ విషయాన్ని తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఆదాయపు పన్ను చెల్లించినా, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులైనా వారు స్కాలర్‌షిప్‌నకు అనర్హులని తెలిపారు. నూతన ఉన్నత అభిలాష NUA-ఒడిశా పేరిట ఈ పథకం అమలు కానుంది. 2023-24 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.385 కోట్ల బడ్జెట్‌తో ఈ పథకం 30 జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఒడిశాలో 4.5లక్షల మంది డిగ్రీ విద్యార్థులు, 32వేల మంది పీజీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల విద్యార్థులతో పాటు ఉన్నత విద్యా శాఖ ఆధ్వర్యంలోని సంస్కృత కళాశాలలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత అకడమిక్ ఇయర్ కు సంబంధించి ఈ స్కాలర్‌షిప్ నగదును ఫిబ్రవరి 20 నుంచి అర్హులైన విద్యార్థుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయనున్నారు. న్యూ ఒడిశా దిశగా ముఖ్యమంత్రి దార్శనికత, విద్యార్థుల సాధికారతకు.. ఇది ముఖ్యమని పాండియన్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..