అంబానీ కోడలు హ్యాండ్‌ బ్యాగ్‌ కాస్ట్‌ ఎంతో తెలుసా ??

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్‌ ‘నీతా ముకేశ్‌ అంబానీ సాంస్కృతిక కేంద్రం మార్చి 31న ప్రారంభమైంది. ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలో దేశంలోని పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు.

అంబానీ కోడలు హ్యాండ్‌ బ్యాగ్‌ కాస్ట్‌ ఎంతో తెలుసా ??

|

Updated on: Apr 09, 2023 | 9:20 PM

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్‌ ‘నీతా ముకేశ్‌ అంబానీ సాంస్కృతిక కేంద్రం మార్చి 31న ప్రారంభమైంది. ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలో దేశంలోని పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలో అనంత్‌ అంబానీ, ఆయనకు కాబోయే భార్య రాధిక మర్చంట్‌ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవలే నిశ్చితార్థం పూర్తి చేసుకున్న ఈ జంట.. నల్లని రంగు దుస్తుల్లో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండో వెస్ట్రన్‌ స్టైల్‌ లేస్‌ శారీలో వచ్చిన రాధిక అనంత్‌ అంబానీతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో రాధిక చేతిలో ఉన్న చిన్న బ్యాగ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆబ్యాగ్‌ పైన నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. అది చాలా ఖరీదైందని దాదాపు 52 లక్షల రూపాయల ఖరీదు చేస్తుందని ఏకంగా ఓ వెబ్‌సైట్‌ దాని ధరపైన రీసెర్చ్‌ చేసిమరీ తెలిపింది. సిల్వర్‌ రంగులో ఉన్న ఈ హెర్మిస్‌ కెల్లీమోర్ఫోస్‌ బ్యాగ్‌లో మిక్ ఫ్రంట్ ఫ్లాప్, సిగ్నేచర్ కెల్లీ డిజైన్‌తో పాటు చైన్‌మెయిల్ బాడీ, భుజానికి తగిలించుకునేందుకు వీలుగా షార్ట్ స్ట్రాప్, క్లోచెట్‌తో కూడిన పొడవాటి చైను కలిగి ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యువకుడి ప్రాణం తీసిన సిక్స్ ప్యాక్ మోజు

Upasana Konidela: నేను అందంగా లేనన్నారు.. పెళ్లయిన కొత్తలో బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నా

వేదిక‌పై పెళ్లి కొడుకు డ్యాన్స్.. రొమాంటిక్‌ కానే కాదని..

Mother Dog Love: తల్లడిల్లిన కన్నతల్లి పేగు బంధం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

గాయపడిన పక్షికి చికిత్స చేసి చేరదీస్తే జైల్లో వేస్తారా ??

Follow us