తుపాకులతో బ్యాంకుకు వచ్చారు.. 20 నిమిషాల్లో దోచేశారు

Updated on: Apr 20, 2026 | 7:51 PM

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో పట్టపగలే బ్యాంకు దోపిడీ జరిగింది. తుపాకులతో లోపలికి చొరబడిన దుండగులు కేవలం 20 నిమిషాల్లో రూ. 35 లక్షల నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. మేనేజర్‌ను బెదిరించి, దాడి చేసి తాళాలు లాక్కున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గాలిస్తున్నారు. ఈ భారీ దొంగతనం స్థానికంగా సంచలనం సృష్టించింది.

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో పట్టపగలు దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు బ్యాంకులో చొరబడి తుపాకులతో సిబ్బిందిని బెదిరించి బ్యాంకును దోచేశారు. ఇదంతా కేవలం 20 నిమిషాల్లో జరిగిపోయింది. పక్కాప్లాన్‌తో వచ్చిన దొంగల్లో..మొదట ఇద్దరు వ్యక్తులు వినియోగదారులుగా బ్యాంకులోకి వెళ్లారు. కొద్దిసేపటికే మరో ముగ్గురు దుండగులు కూడా తుపాకులతో లోపలికి చొరబడ్డారు. వారు గాలిలోకి కాల్పులు జరుపుతూ, అందరినీ బంధించారు. లాకర్ల తాళాలు ఇవ్వాలని బ్రాంచ్ మేనేజర్‌ను డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో దుండగులు అతడిపై దాడి చేసి, బలవంతంగా తాళాలు లాక్కొని, రూ. 35 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయారు. ఈ మొత్తం ప్రక్రియ కేవలం 20 నిమిషాల్లోనే ముగిసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రద్దీగా ఉండే ప్రాంతంలో, పగటిపూట జరిగిన ఈ భారీ దోపిడీ స్థానికంగా సంచలనంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘అమ్మా, నేను పాసయ్యా’.. మనసుల్ని గెలిచిన వీడియో

దోమల బెడద మధ్యే డ్యూటీ.. సెక్యూరిటీ గార్డ్ వీడియో వైరల్!

అత్తను కాపాడేందుకు కోడలి సాహసం.. ఏం చేసిందో చూడండి

పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పెరుగు

రాజమండ్రిలో ఆవకాయ పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

Follow Us