ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్‌లు..

|

Jan 12, 2025 | 2:28 PM

వివిధ ప్రాణాంతక వైరస్‌లకు పుట్టినిల్లు చైనా. 2019లో కరోనాతో యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ మహమ్మారి బారిన పడి కోట్లమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఈ వైరస్‌ కొత్త కొత్త వేరియంట్లుగా మానవాళిపై తన ప్రభావం చూపుతూనే ఉంది. ఇప్పుడు మరో చైనా వైరస్ హెచ్‌ఎంపీవీ తన ఉనికిని చాటుతోంది. ఈ వైరస్ ప్రస్తుతం చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనాను మరచిపోకముందే హెచ్‌ఎంపీవీ కేసులు భారత్‌లో నమోదవుతుండటంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వైరస్‌ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ వైరస్‌కు ముందే ప్రపంచంలో ఎన్నోవైరస్‌లు ఉన్నాయి. అవి వివిధ కాలాల్లో జనాలను వణికించాయి. ప్రపంచంలో దాదాపు 3 లక్షల 20 వేల రకాల వైరస్‌లున్నాయి. ఈ వైరస్‌లలో అత్యంత ప్రమాదకరమైనవి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కరోనా వైరస్ కంటే ముందు ఏఏ వైరస్‌లు ప్రపంచాన్ని వణికించాయనే విషయానికొస్తే.. ప్రధానమైనది రోటా వైరస్.. దీనిని చైల్డ్‌ కిల్లర్‌ వైరస్ అని కూడా అంటారు. ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పిల్లల ప్రాణాలను హరిస్తోంది. ఇది నవజాత శిశువులు, 6 నుంచి 8 ఏళ్ల వయసు గల పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముళ్ల పందులు, చిరుత ఎలా కొట్లాడుకున్నాయో చూడండి

డాకు మహారాజ్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే

‘వదిన’ను పెళ్లి చేసుకున్న సాయికిరణ్ ఫోటోలు వైరల్

రూ.100 కోట్లతో కొత్త ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్

దిమ్మతిరిగే న్యూస్.. బన్నీతో బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ భారీ బడ్జెట్ సినిమా