Loading video

అచ్ఛం మనిషిలాగే గాలిపటాన్ని ఎగరేసిన కోతి

|

Jan 24, 2025 | 12:26 PM

సంక్రాంతి పండగ అయిపోయింది. మూడు రోజుల పాటు పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. పతంగులు ఎగరేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. అసలు సంక్రాంతి అంటేనే పతంగులు.. పతంగులు అంటేనే సంక్రాంతి అనే రేంజ్‌లో సాగింది పండగ. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ సందర్భంగా ఓ అసాధారణ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసి జనాలు షాకవుతున్నారు. సంక్రాంతి పండగను మీరు మాత్రమే చేసుకుంటారా? పతంగులను మీరు మాత్రమే ఎగరేస్తారా? మేం పండగ చేసుకోలేమా? పతంగులు ఎగరేయలేమా అన్నట్లుగా ఓ కోతి పతంగి ఎగరేస్తూ ఫుల్‌ ఎంజాయ్‌ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలోని కోతి చేష్టలు చూశాక.. దీనికి ఇంత నేర్పు ఎలా వచ్చిందో అంటూ షాకైపోతున్నారు. ఓ బిల్డింగ్‌పై కూర్చున్న కోతి సునాయసంగా పతంగి ఎగరేయడం అక్కడున్న వారిని ఆకర్షించింది. దీంతో ఆ దృశ్యాల్ని వారు కెమెరాలో బంధించి నెట్టింట షేర్‌ చేశారు. కోతికి ఎలా దొరికిందో కానీ ఓ పతంగి దారం దొరికింది. దాని సాయంతో అది అచ్చు మనుషుల్లాగే పతంగిని కిందకు దింపే ప్రయత్నం చేసింది. మొదట కాస్త తడబడ్డా ఆ తరువాత తేరుకుని పతంగిని తనకు అందేంత ఎత్తుకు తీసుకొచ్చి ఆ తరువాత దాన్ని గాల్లో జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసింది. వెనకున్న భవంతిపై ఉన్న కొందరు ఇదంతా చూసి ఆశ్చర్యపోతూ.. ఈలలు వేస్తూ కేకలు పెడుతూ గోలగోల చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ ఇంటి మెయిన్‌ డోర్‌కి నేమ్‌ ప్లేట్‌ పెట్టారా? తేడా వస్తే ఎంత డేంజరంటే

స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా పంపి రూ.2.8 కోట్లు స్మార్ట్ గా కొట్టేశారు

టీ తాగుదాం రమ్మని పిలిచి.. ఉన్నదంతా దోచి..

మార్స్‌పై రాత్రి.. ఎలా ఉంటుందో తెలుసా ??

రోజూ బెల్లం తింటే..కోపం తగ్గిపోతుందట..