నాకు ఇంటరెస్ట్ లేదు.. లేడీ అఘోరీ నన్ను బలవంతం చేసింది

Updated on: May 16, 2025 | 5:52 PM

మహిళా అఘోరి జైలుకెళ్లినా కూడా ఆమె పేరు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్‌ చేస్తూనే ఉంది. తొలుత పూజలతో మొదలైన అఘోరీ ప్రస్థానం.. ఇప్పుడు పెళ్లిళ్ల గోల వరకు వచ్చింది. మంగళగిరి అమ్మాయిని పెళ్లి చేసుకున్న వీడియో సంచలనం రేపింది. అయితే ఇది మొదటి పెళ్లి కాదు.. తనను కూడా అఘోరీ ఇలానే పెళ్లి చేసుకుని మోసం చేసిందంటూ మీడియా ముందుకు వచ్చింది మరో మహిళ.

తనను పెళ్లి చేసుకుని వాడుకుని వదిలేసిందంటూ కరీంనగర్‌కు చెందిన ఓ మహిళ ఆందోళన బాటపట్టింది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి పేరు మార్మోగిపోతుంది. అఘోరి లీలలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే తాంత్రిక పూజల పేరుతో ఓ మహిళ వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన కేసులో జైలులో రిమాండ్‌లో ఉంది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న అఘోరిపై మరో కేసు నమోదయ్యింది. ఈసారి అత్యాచారం కేసు ఫైల్ కావడం గమనార్హం. ఈ కేసు కరీంగనర్ జిల్లా, కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదు చేశారు.లేడీ అఘోరి తనకు బలవంతంగా తాళి కట్టిందని.. అంతేకాక తనపై అత్యాచారం ప్రయత్నం కూడా చేసిందంటూ ఓ యువతి కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సనాతన ధర్మం పేరుతో అఘోరి పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత తనను ట్రాప్ చేసి.. ప్రేమించానని మాయ మాటలు చెప్పిందని బాధితురాలు ఆరోపించింది. అంతటితో ఆగక.. తనను బలవంతంగా కొండగట్టు తీసుకెళ్లి మెడలో తాళి కూడా కట్టిందని పోలీసులకు తెలిపింది. ఆపై తనపై అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నం చేసిందని బాధితురాలు ఆరోపించింది. అంతేగాక నను బెదిరించి 3 లక్షల రూపాయలు తీసుకుందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాంబులా పేలిన టాయిలెట్‌ సీట్‌.. ఇక ప్రశాంతంగా అక్కడ కూడా కూర్చోలేమా !!

హనీ ట్రాప్‌లో పాక్‌ హైకమిషనర్‌… అశ్లీల వీడియోలు లీక్‌

చెరువులో ఈతకు దిగి ఐదుగురు మృతి

బరువు తగ్గాలనుకునే వారికి బఠానీలు బెస్ట్‌ చాయిస్‌

పల్లీలు నువ్వులు కలిపి తింటే ఎన్ని లాభాలో ??