రూ.75 లక్షల లాటరీ గెలిచాడు.. భయంతో వణికాడు

|

Jan 13, 2024 | 9:21 PM

కేరళలో ఓ వలస కార్మికుడు లాటరీలో రూ.75 లక్షలు గెలుచుకున్నాడు. అయితే ఆ లాటరీ టికెట్‌ను ఎవరైనా లాగేసుకుంటారన్న భయంతో పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించాడు. లాటరీ టికెట్‌ను బ్యాంకులో డిపాజిట్‌ చేసేందుకు పోలీస్‌ రక్షణ కోరాడు. ఆ కార్మికుడి భయాన్ని అర్థం చేసుకున్న పోలీసులు సానుకూలంగా స్పందించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికుడు అశోక్‌ కొన్ని నెలల కిందట కేరళ వచ్చాడు. మలప్పురం జిల్లాలోని పెరింతల్మన్న ప్రాంతంలో ఇతర కార్మికులతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తున్నాడు.

కేరళలో ఓ వలస కార్మికుడు లాటరీలో రూ.75 లక్షలు గెలుచుకున్నాడు. అయితే ఆ లాటరీ టికెట్‌ను ఎవరైనా లాగేసుకుంటారన్న భయంతో పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించాడు. లాటరీ టికెట్‌ను బ్యాంకులో డిపాజిట్‌ చేసేందుకు పోలీస్‌ రక్షణ కోరాడు. ఆ కార్మికుడి భయాన్ని అర్థం చేసుకున్న పోలీసులు సానుకూలంగా స్పందించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికుడు అశోక్‌ కొన్ని నెలల కిందట కేరళ వచ్చాడు. మలప్పురం జిల్లాలోని పెరింతల్మన్న ప్రాంతంలో ఇతర కార్మికులతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తున్నాడు. కొన్ని నెలల కిందట కేరళ ప్రభుత్వానికి చెందిన విన్-విన్ లాటరీ టికెట్‌ కొనుగోలు చేశాడు. మొదటి బహుమతిగా రూ.75 లక్షలు గెలుచుకున్నాడు. గెలిచిన లాటరీ టికెట్‌ను బ్యాంకులో సురక్షితంగా సమర్పించేందుకు సీనియర్ సీపీఓతో సహా పోలీసు సిబ్బందిని అశోక్‌ వెంట పంపారు. దీంతో పోలీసు రక్షణతో బ్యాంకుకు వెళ్లిన అతడు గెలిచిన లాటరీ టికెట్‌ను సమర్పించాడు. ఆ తర్వాత లాటరీ టికెట్‌ గెలిచిన ఆనందాన్ని అనుభవించాడు. బెంగాల్‌లోని తన స్వగ్రామానికి తిరిగి వెళ్లాలని అతడు నిర్ణయించుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీతారాముల వేషధారణలో ఇండిగో సిబ్బంది

ఉప్పల్‌ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ టెస్ట్‌ మ్యాచ్‌.. విద్యార్ధులకు ఫ్రీ ఎంట్రీ

భూగోళానికి పొంచివున్న విపత్తు.. అత్యంత వేడి సంవత్సరంగా 2023

వెజ్‌ మీల్‌లో నాన్‌వెజ్‌.. ఎయిర్‌ ఇండియా విమానంలో సిబ్బంది నిర్వాకం

స్మార్ట్‌ఫోన్‌ను తలదన్నే డివైస్‌.. పాకెట్‌లో ఇమిడిపోయే ‘ర్యాబిట్‌ ఆర్‌1’