Mentally handicapped: మానసిక వికలాంగుడి ప్రాణం తీసిన గ్రామపెద్దల నిర్వాకం..! ఎటు పోతుందో సమాజం..

|

Jun 08, 2022 | 9:19 PM

సాధారణంగా న్యాయం చేసేందుకు పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఉన్నాయి. అయితే గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ గ్రామ పెద్దలదే పెత్తనం నడుస్తోంది. ఎలాంటి అవగాహన లేకుండా ఇష్టా రాజ్యంగా తీర్పు అమలు చేస్తుంటారు.


సాధారణంగా న్యాయం చేసేందుకు పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఉన్నాయి. అయితే గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ గ్రామ పెద్దలదే పెత్తనం నడుస్తోంది. ఎలాంటి అవగాహన లేకుండా ఇష్టా రాజ్యంగా తీర్పు అమలు చేస్తుంటారు. కొన్ని సార్లు ఇలాంటి తీర్పులు తీవ్ర దుమారం రేపుతుంటాయి. తాజాగా ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రామపెద్దల నిర్వాకం ఓ మానసిక వికలాంగుడి ప్రాణం తీసింది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. మృతుడు అతని సొంత కుటుంబసభ్యుల చేతిలో దారుణ హత్యకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. పంచాయతీ పెద్దల హుకుం ను ధిక్కరించే ధైర్యం చేయలేని వారు.. కుటుంబ పెద్దను దారుణంగా చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చేశారు. సీతంపేట మండలం రేగులగూడలో మే 27న ఘర్షణ జరిగింది. గ్రామానికి చెందిన సవర గయా కుమార్తె పద్మను మతిస్థిమితం లేని సవర సింగన్న కర్రతో కొట్టాడు. దీంతో గయా – సింగన్న మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సింగన్న కర్రతో దాడి చేయడంతో గయా అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం గ్రామపెద్దలకు చేరడంతో.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. తలకు తల అని తీర్పు చెప్పారు. ఈక్రమంలో ఈనెల 28న సింగన్నపై విష ప్రయోగం చేశారు. అయినా చనిపోకపోవడంతో ఉరేశారు. మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా కాల్చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Follow us on