బుద్ధిలేని మాస్టర్.. క్లాస్‌రూమ్‌లోనే మందేసి చిందులు.. పైపెచ్చు…

|

Sep 29, 2022 | 9:51 AM

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ లెక్చరర్ ట్రాక్ తప్పాడు. స్టూడెంట్స్‌కు పాఠాలతో పాటు మంచి చెడ్డలు నేర్పాల్సిన అతను.. తప్పుడు పని చేశాడు. క్లాస్‌రూమ్‌లోనే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు.

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ లెక్చరర్ ట్రాక్ తప్పాడు. స్టూడెంట్స్‌కు పాఠాలతో పాటు మంచి చెడ్డలు నేర్పాల్సిన అతను.. తప్పుడు పని చేశాడు. క్లాస్‌రూమ్‌లోనే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. మద్యం సేవించి.. తూలుతూ డ్యాన్స్ చేశాడు. పంజాబ్‌ పఠాన్‌కోట్‌ లోని జీఎన్​డీయూ కాలేజ్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ప్రస్తుం ఈ మాస్టారు నాటు స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సదరు లెక్చరర్ కాలేజ్‌లో గణితం బోధిస్తున్నట్లు తెలిసింది. ‘నేను సంపాదించిన సొంత డబ్బుతో మందు తాగుతున్నా, నన్ను ఎవరూ క్వచ్చన్ చేయలేరు’ అంటున్నాడు. అంతే కాదండోయ్.. ఓ సినిమాలోని పాటకూడా అందుకున్నాడు. పాటపాడుతూ డ్యాన్స్ చేశాడు. నెట్టింట వైరల్‌ అయిన ఈ వీడియోపై సదరు లెక్ఛరర్ రెస్పాండ్ అయ్యాడు. తాను ఆ సమయంలో మందు తాగలేదని, తాగినట్లు నటించినట్లు వివరణ ఇచ్చాడు. అదంతా సరదాగా చేశామని.. కొందరు కావాలని వైరల్ చేశారని ఆరోపించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తవ్వకాల్లో బయటపడ్డ వేల ఏళ్ల నాటి గుహ.. అందులో ఏమున్నాయో చూస్తే కళ్లు జిగేల్‌..

విశాల్ ఇంటిపై దాడి.. భయాందోళనలో హీరో ఫ్యామిలీ

ఆసుపత్రిలో దీపిక !! గుండె పనితీరుపై డాక్టర్ల వార్నింగ్

5 లక్షలని.. అత్యాశకు పోయి.. న్యూడ్ ఫోటోలు బయటపడేసుకుంది

Follow us on