వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది

Updated on: Jun 09, 2026 | 3:06 PM

మణుగూరు సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల వద్ద భారీ ఇండియన్ రాక్ పైథాన్ కనిపించడం కార్మికుల్లో భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ ముజాఫర్ చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని రేగులగండి రిజర్వ్ ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు. ఈ జాతి విషరహితమని, ఇలాంటి పాములు కనిపిస్తే హాని చేయకుండా నిపుణులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

జిల్లాలోని మణుగూరు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల వద్ద రాత్రి వేళ ఒక భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. గనిలోని నీటిని బయటకు పంపించే మోటార్ల వద్ద రాత్రి 10 గంటల సమయంలో కార్మికులు భారీ కొండచిలువను గుర్తించారు. అర్ధరాత్రి చీకట్లో గోల్డ్ కలర్‌లో మెరిసిపోతూ, భారీ శబ్దాలు చేస్తూ సంచరిస్తున్న కొండచిలువను చూసి, తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక స్నేక్ క్యాచర్ ముజాఫర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంత పెద్ద కొండచిలువను ఆయన ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా రేగులగండి రిజర్వ్ ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు. ప్రాణాలకు తెగించి కొండచిలువను పట్టుకున్న స్నేక్ క్యాచర్‌ను సింగరేణి అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. ఇది ‘ఇండియన్ రాక్ పైథాన్’ జాతికి చెందిన కొండచిలువ అని ముజాఫర్ తెలిపారు. ఇవి సాధారణంగా విషరహితమైనవని తెలిపాడు. ఇలాంటివి ఎక్కడైనా కనిపిస్తే.. అనవసరంగా భయపడి వాటికి ఎలాంటి హాని తలపెట్టవద్దని కోరారు. ఎక్కడైనా పాములు లేదా కొండచిలువలు కనిపిస్తే స్వయంగా పట్టుకోవడానికి ప్రయత్నించకుండా, వెంటనే తమలాంటి నిపుణులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jagapathi Babu: పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది

Jagapathi Babu: ‘పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు

Peddi: దూసుకుపోతున్న ‘పెద్ది’కి.. అదే పెద్ద పరీక్ష

Follow Us