మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప

Updated on: Mar 19, 2026 | 1:59 PM

ఉగాది మత్స్యకారులను ఓ రోజు ముందే పలకరించింది. మత్స్యకారులకు జీవనాధారం చేపల వేట.. ఆ గంగమ్మను నమ్ముకొని నదిలో చేపలవేటకు వెళ్తారు. వలనిండా చేపలు పడాలని కోరుకుని వలవేస్తారు. తాజాగా కొందరు మత్స్యకారులకు గంగమ్మ కరుణతో ఉగాది ముందే వచ్చినట్టయింది. మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం వశిష్ఠ గోదావరి తీరంలో స్థానిక మత్స్యకారుల వలకు భారీ 'పండుగప్ప' చిక్కింది. సుమారు 20 కిలోల బరువున్న ఈ భారీ చేపను చూసి స్థానికులు నోరెళ్లబెట్టారు.

గోదావరి పండుగప్ప అంటే భోజన ప్రియులకు ప్రాణం. చేపలన్నింటిలో దీని రుచి ప్రత్యేకం. అందుకే దీనిని ‘చేపల రారాజు’ అని పిలుస్తారు. సాధారణంగా చిన్న సైజులో దొరికే ఈ చేప, ఏకంగా 20 కిలోల భారీ ఆకారంలో లభించడంతో దానిని గట్టుకు చేర్చడానికి మత్స్యకారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ భారీ చేపను చూడటానికి చుట్టుపక్కల జనం భారీగా తరలివచ్చారు. మార్కెట్‌కు తీసుకురాకముందే ఈ పండుగప్ప కోసం పోటీ మొదలైంది. చివరకు 10 వేల రూపాయల భారీ ధర పలికినప్పటికీ, ఆ రుచి తెలిసిన మాంసాహార ప్రియులు ఏమాత్రం వెనకాడకుండా దీనిని దక్కించుకున్నారు. ఈ అదృష్టాన్ని దక్కించుకున్న వారు ఇంటికి తీసుకెళ్లి, గోదావరి స్టైల్‌లో మసాలాలు దట్టించి వండటంతో ఆ వీధి అంతా చేపల కూర వాసనతో నిండిపోయింది. “గోదావరి పండుగప్ప దొరికితే అది మత్స్యకారుడికి లాభం.. తిన్నవాడికి యోగం” అంటూ స్థానికులు ముచ్చటించుకుంటున్నారు. మొత్తానికి ఈ భారీ పండుగప్ప యలమంచిలి తీరంలో ఒక చిన్నపాటి పండుగ వాతావరణాన్ని నింపింది.

మరిన్ని వీడియోల కోసం :

ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో

బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

 

 

Follow Us