ఈ విగ్గు రాజా.. విగ్గులు మారుస్తూ 50 మంది యువతులుకు మోసం

|

Dec 21, 2024 | 11:24 AM

హైదరాబాద్ లో నిత్యపెళ్లికొడుకు వంశీకృష్ణపై మరోసారి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తప్పుడు వేషధారణతో, విగ్‌లు పెట్టుకుని, మ్యాట్రిమోని వెబ్‌సైట్లను వేదికగా చేసుకుని, అమాయకులను మోసం చేస్తూ దోచుకుంటున్న అతడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులను మోసపుచ్చి కోట్ల రూపాయలు కాజేసిన వంశీకృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వంశీకృష్ణ మొదట మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో ప్రొఫైల్స్ సృష్టిస్తాడు. అందమైన ఫోటోలు, ఆకర్షణీయమైన వివరాలతో తనను ఐఏఎస్, ఐపీఎస్ వంటి హోదాల్లో ఉన్న వ్యక్తిగా చూపిస్తాడు. వివాహం కోసం క్రమంగా సంబంధిత అమ్మాయి తల్లిదండ్రులతో చర్చలు మొదలుపెట్టి వారి నమ్మకాన్ని పొందుతాడు. తాను తీరా పెళ్లికి సిద్ధమయ్యాననగానే ఆర్థిక సమస్యల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు అడుగుతాడు. గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ డాక్టర్ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని వంశీకృష్ణ మాటిచ్చాడు. ఆమె తండ్రిని నమ్మించి 40 లక్షలు రూపాయిలు తీసుకున్నాడు. అయితే, డబ్బు విషయంలో మరోసారి ఒత్తిడి చేయడంతో, ఆమె తండ్రికి అనుమానం కలిగింది. ఈ సమయంలో వంశీకృష్ణ, ఆ మహిళా డాక్టర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి పరువు తీయుతానంటూ బెదిరించడం ప్రారంభించాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

X వ్యాధి.. కరోనా కంటే 7 రెట్లు డేంజర్

ఫ్యామిలీ అంటే మీదేనయ్యా !! నలుగురికీ గిన్నిస్ రికార్డులు

కాకి బిర్యానీ కోసం 19 కాకులను చంపిన దంపతులు

శునకానికి వర్ధంతి.. జ్ఞాపకాలతో ఫ్లెక్సీ ఏర్పాటు