World’s Tallest Woman: ప్రపంచంలోని అతి పొడవైన మహిళ కన్నుమూత..

Updated on: May 01, 2024 | 8:25 PM

ప్రపంచంలోని అతి పొడవైన మహిళ బ్రెజిల్‌కు చెందిన మరియా శాంటోస్‌ 77 ఏళ్ల వయసులో కన్ను మూశారు. 'క్వీన్ ఆఫ్ హైట్'గా పేరున్న మరియా అనారోగ్యంతో అరకాజులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నిమోనియాతో బాధపడుతున్న మరియా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణంతో బ్రెజిల్ వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ప్రపంచంలోని అతి పొడవైన మహిళ బ్రెజిల్‌కు చెందిన మరియా శాంటోస్‌ 77 ఏళ్ల వయసులో కన్ను మూశారు. ‘క్వీన్ ఆఫ్ హైట్’గా పేరున్న మరియా అనారోగ్యంతో అరకాజులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నిమోనియాతో బాధపడుతున్న మరియా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణంతో బ్రెజిల్ వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అభిమానులు, రాజకీయ నాయకులు ఆమె మృతిపై సంతాపం ప్రకటించారు. అరకాజు మేయర్ ఎడ్వాల్డో నోగ్వేరా రాజధాని నగరంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.

యుక్తవయసులో 7 అడుగుల 3.8 అంగుళాల ఎత్తులో ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన మహిళగా నిలిచారు. ఆ తర్వాతి కాలంలో ఆమె ఎత్తు కాస్త తగ్గుతూ వచ్చారు. ఆమె బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణితో పాటు మంచి గాయని కూడా. దేశంలో వేర్వేరు నగరాల్లో జరిగే సర్కస్‌లలో పాల్గొంటూ వీక్షకులను అబ్బురపరిచారు. ఆ తరువాత అంతర్జాతీయంగా కూడా పాపులర్‌ అయ్యారు. మరియా కుటుంబసభ్యులు 7 అడుగుల హైట్‌తో ఆశ్చర్యపరిచారు. మరియా తండ్రి, ఆంటోనియో సిల్వా ఎత్తు 7 అడుగుల 8.7 అంగుళాలు కాగా ఆమె తాత 7 అడుగుల 5.4 అంగుళాల ఎత్తు ఉండే వారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us