Mango Paneer Dosa: ఇలాంటి దోశ జీవితంలో తినుండరు..! మ్యాంగో-పన్నీర్‌ దోశ.. టేస్టే వేరప్ప..!

Updated on: Apr 13, 2023 | 9:37 PM

రోజు రోజుకీ వింత వింత వంటకాల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొన్ని రకాల ప్రయోగాలు భోజన ప్రియులను ఆకర్షిస్తూ తినాలి అనిపించేలా ఉంటాయి. కొన్ని ప్రయోగాలు మాత్రం వద్దు బాబోయ్.. అనిపించేలా ఉంటాయి.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ స్ట్రీట్‌ ఫుడ్ వ్యాపారి దోశలు వేస్తున్నాడు. అదికూడా మ్యాంగో-పన్నీర్‌ కాంబినేషన్‌లో. చూడ్డానికి కలర్‌ఫుల్‌గా బాగానే ఉందనిపించినా తినడానికి కాస్తా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఇలాంటి కాంబినేషన్‌ ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండరు మరి. ఇతను పెనంపైన దోశ పిండి వేసి దానిమీద మ్యాంగో జ్యూస్‌ వేశాడు. అంతటితో ఆగకుండా దానిపైన పన్నీర్‌ తురుము కూడా వేశాడు. ఆ తర్వాత దోశను నిలువుగా కట్‌ చేసి రోల్స్‌ లాగా చుట్టి, మ్యాంగోజ్యూస్‌నే చట్నీగా సర్వ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ దోశ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. వీడియో చూసిన నెటిజన్లు దోశ చూడ్డానికి కలర్‌ఫుల్‌గానే ఉంది.. కానీ తింటే ఏమవుతుందో దేవుడికే తెలియాలి అంటున్నారు. ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Published on: Apr 13, 2023 09:37 PM