18 సార్లు లాటరీ కొట్టినా.. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’ అన్న భర్త

Updated on: May 19, 2026 | 6:04 PM

అమెరికాకు చెందిన రాబర్ట్ బెవన్ 18 సార్లు లాటరీ గెలిచి కోట్ల రూపాయలు సొంతం చేసుకున్నారు. తాజాగా మరోసారి రూ.41 లక్షల బహుమతి గెలుచుకున్న ఆయన, “నా జీవితంలో అసలైన అదృష్టం డబ్బు కాదు.. 40 ఏళ్లుగా నాతో ఉన్న నా భార్య” అంటూ భావోద్వేగంగా చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆయన ప్రేమ, కుటుంబ బంధాన్ని ప్రశంసిస్తున్నారు.

అమెరికాలోని ఇడహో స్టేట్‌కి చెందిన రాబర్ట్ బెవన్ ఇప్పటి వరకు గెలుచుకున్న లాటరీల సంఖ్య 18కి చేరింది. తాజాగా ఆయన రూ. 41 లక్షలకు పైగా .. అంటే 50,000 డాలర్ల బహుమతిని గెలుచుకున్నారు. అయితే ఈ భారీ విజయం తర్వాత ఆయన చెప్పిన ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను ఆకట్టుకుంటోంది. రాబర్ట్ బెవన్‌ ను 1997లో అదృష్ట లక్ష్మీ పట్టుకుంది. ఇప్పటి వరకు వదల్లేదు. మొదటి సారిగా ‘చెవర్లే ’ కారును బహుమతిగా గెలుచుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయనకు లాటరీలలో వరుస విజయాలు దక్కడం ప్రారంభమైంది. చిన్న చిన్న నగదు బహుమతుల నుంచి మొదలుకొని.. ఏకంగా రూ. 1.6 కోట్లకు పైగా విలువైన భారీ జాక్‌పాట్‌లను కూడా ఆయన పలుమార్లు సొంతం చేసుకున్నారు. రాబర్ట్ ఎప్పుడూ డబ్బు కోసం లాటరీ టికెట్లు కొనలేదని చెప్పడం విశేషం. లాటరీ టిక్కెట్లు కొనడం అనేది ఆయనకు, ఆయన భార్యకు ఒక సరదా అలవాటుగా మారిపోయిందని.. ప్రతి వారం ఇద్దరూ కలిసి సరదాగా టిక్కెట్లు కొనేవాళ్లమని అంటున్నారు. 18 సార్లు లాటరీ గెలవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటని లాటరీ అధికారులు రాబర్ట్‌ను ప్రశ్నించగా.. తన జీవితంలో అన్నింటికంటే పెద్ద అదృష్టం లాటరీ డబ్బులు కావు. నా భార్యతో గడిపిన 40 ఏళ్ల వైవాహిక జీవితమే నా అసలైన లక్. అదే నా సక్సెస్ సీక్రెట్.” అని రాబర్ట్ భావోద్వేగంగా సమాధానం ఇచ్చారు. ఆయన చెప్పిన ఆ మాటలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆయనకు వచ్చిన డబ్బు కంటే.. భార్యపై ఆయనకు ఉన్న అపారమైన ప్రేమ, గౌరవాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదృష్టం అంటే కేవలం కోట్లాది రూపాయలు చేతుల్లోకి రావడం, లగ్జరీ కార్లు ఉచితంగా పొందడం మాత్రమే అనుకునే వారికి.. రాబర్ట్ బెవన్ ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని వివరించారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు… ఏకంగా 18 సార్లు లాటరీ గెల్చుకున్న అతడు.. తన చేతికి చిక్కిన కోట్ల రూపాయల కంటే తన చేతిని పట్టుకుని నడిచిన తన భార్యే జీవితంలో అతిపెద్ద అదృష్టమని చాటి చెప్పారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు నెటిజెన్లను ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ

రైలు దూసుకొచ్చినా విడిచిపెట్టలేదు.. పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి

ముందే రుతుపవనాలు.. కానీ ‘ఎల్ నినో’ గండం!

10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్‌లో 720కి 107 మార్కులే !! బయటపడిన భారీ స్కామ్

అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని! వైరల్ అయిన ఉద్యోగిని వీడియో

Follow Us