ఈదురు గాలుల ధాటికి.. 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డ వ్యక్తి!

Updated on: May 15, 2026 | 12:32 PM

ఉత్తరప్రదేశ్‌లో భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. బరేలీ జిల్లాలో ఓ వ్యక్తి టిన్ షెడ్‌తో సహా గాల్లోకి ఎగిరిపోయి సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడిన ఘటన షాక్‌కు గురిచేస్తోంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఉత్తరప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన భారీ గాలివాన అక్కడితో ఆగలేదు. మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఈదురు గాలుల ధాటికి ఒక వ్యక్తి టిన్ షెడ్‌తో సహా అమాంతం గాల్లోకి లేచి, సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా బమియానా గ్రామానికి చెందిన నన్హే మియాన్ అనే వ్యక్తి బుధవారం కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల సమయంలో బయట ఉన్నాడు. గాలి వేగం ఎంత తీవ్రంగా ఉందంటే.. ఒక్కసారిగా వచ్చిన సుడిగాలికి అతను పట్టుకున్న టిన్ షెడ్‌తో పాటు సుమారు 50 అడుగుల ఎత్తుకు గాల్లోకి ఎగిరిపోయాడు. అంత ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందపడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నన్హే మియాన్ కాళ్లు, చేతులు విరిగిపోవడంతో స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడికి ప్రభుత్వం తరఫున పూర్తి ఆర్థిక సహాయం అందిస్తామని అధికారులు ప్రకటించారు. కాగా, గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న అకాల వర్షాలు, గాలివాన బీభత్సంతో జనం భయాందోళన చెందుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Air India: విమాన ప్రయాణికులకు షాక్‌.. 1,200 విమానాలు రద్దు

ఇంట్లో బంగారం దాచుకున్న వారికి బంపర్ ఆఫర్.. 10 గ్రాములున్నా లాభమే

ఆర్థిక సంక్షోభం దిశగా ప్రపంచం.. ఉప్పు నుండి ఉక్కు వరకు రేట్లు డబుల్

Loading...
Unable to load recommendations.
Follow Us