బోనులోనే ఉంది కదా అని షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు !! తర్వాత సింహం ఇచ్చిన ట్విస్ట్ కు షేక్ అయ్యాడు
జూ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి సింహం ఉన్న ప్రదేశంలోకి వచ్చాడు. అక్కడ సింహం బోనులో ఉంది. ఆ సింహాన్ని చూసిన ఈ వ్యక్తికి ఓ చిలిపి ఆలోచన వచ్చింది. ఈ సింహానికి షేక్ హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు
జూ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి సింహం ఉన్న ప్రదేశంలోకి వచ్చాడు. అక్కడ సింహం బోనులో ఉంది. ఆ సింహాన్ని చూసిన ఈ వ్యక్తికి ఓ చిలిపి ఆలోచన వచ్చింది. ఈ సింహానికి షేక్ హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. సింహం బోనులో చేయి పెట్టాడు. వెంటనే సింహం ఆ చేయిని నోటితో పట్టుకుంటుంది. ఈ ప్రమాదాన్ని ఊహించని ఆ వ్యక్తి.. నొప్పితో విలవిల్లాడిపోయాడు. సింహం బారి నుంచి చేతిని విడిపించుకోవడానికి ముప్పు తిప్పలు పడ్డాడు. అతని పక్కనే ఉన్న వారు కూడా సింహానికి భయపడి అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అయితే కొంత సమయం తర్వాత సింహం అతని చేతిని వదిలేసింది. వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. బోనులో ఉన్నా సింహం సింహమే.. ఇలాంటి తుంటరి పనులు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. అంటూ కామెట్లు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియోను వేలాది మంది వీక్షించగా వందల్లో లైక్ చేసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మగాళ్లకు మాత్రమే.. పెళ్లిని మించి గ్రాండ్‌గా విడాకుల పార్టీ
Viral: అబ్బో వీడి వేశాలో.. షార్క్‌తోనే ఏకంగా రోమాంటిక్ డాన్స్