చెరువునిండా మొసళ్లే.. మధ్యలోంచి బోటు షికారు

|

Jun 07, 2023 | 1:29 PM

మొసలిని చూస్తేనే భయమేస్తుంది. అది నీటిలో ఉన్నా, బయట ఉన్నా దాని భయంకరమైన ఆకారాన్ని చూస్తే ఎవరైనా భయపడతారు. అలాంటిది ఓ వ్యక్తి వందలకొద్దీ మొసళ్ల మధ్యనుంచి బోటు షికారు చేసాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

మొసలిని చూస్తేనే భయమేస్తుంది. అది నీటిలో ఉన్నా, బయట ఉన్నా దాని భయంకరమైన ఆకారాన్ని చూస్తే ఎవరైనా భయపడతారు. అలాంటిది ఓ వ్యక్తి వందలకొద్దీ మొసళ్ల మధ్యనుంచి బోటు షికారు చేసాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ పెద్ద చెరువు కనిపిస్తోంది. దాన్నిండా భయంకరమైన మొసళ్లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. వాటి మధ్యనుంచి ఓ బోటు వేగంగా దూసుకుపోతోంది. అక్కడి దృశ్యాన్ని చేస్తూ ఎవరికైనా ఒళ్ల జలదరిస్తుంది.. ఒకింత భయమేస్తుంది కూడా. కానీ ఆ బోటులో ఉన్న వ్యక్తి మాత్రం వాటిని చూసి ఏ మాత్రం భయపడిపోకుండా బోటులో ముందుకు సాగిపోతున్నాడు. ఆ బోటు రావడాన్ని చూసి మొసళ్లు దాడి చేయలేదు. బదులుగా అవి భయంతో అటూ, ఇటూ పరుగులు తీశాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే 26 లక్షల మంది చూశారు. ఎంతో మంది లైక్ చేస్తూ, కామెంట్లు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఓ యూజర్ తనకు మిలియన్ డాలర్లు ఇచ్చినా మొసళ్లమధ్యను రైడ్‌ చేయనంటూ కామెంట్‌ చేశారు. ఓ ట్విట్టర్‌ యూజర్‌ ఈ వీడియోను తన ఖాతాలో షేర్‌ చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఢిల్లీ మెట్రోలో బెస్ట్ పెర్‌ఫార్మెన్స్.. నెటిజన్ల మనసు దోచిన చిన్నారి

Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ .. లైవ్ వీడియో

మృతదేహాన్ని కారులో డోర్‌ డెలివరీ చేసి పరారైన దుండగులు

టాయిలెట్‌ కెళ్తున్నాడని ఉద్యోగిపై సీరియస్‌..

నాగుపాముతో ప్రీ వెడ్డింగ్ షూట్.. పిచ్చి ముదిరిందనడానికి నిదర్శనం అంటున్న నెటిజనం