బాస్‌.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్‌.. ఏకంగా ఇంటి పైకప్పుపై మహీంద్రా స్కార్పియో

Updated on: Sep 06, 2026 | 11:21 AM

విదేశాలకు వెళ్లే ముందు తన ఖరీదైన కారును దొంగల నుంచి కాపాడుకోవాలని బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణ పార్కింగ్‌లో ఉంచితే చోరీకి గురవుతుందనే భయంతో తన మహీంద్రా స్కార్పియోను ఏకంగా ఇంటి పైకప్పుపైకి ఎక్కించి పార్క్‌ చేశాడు. ఈ వింత పార్కింగ్‌ చూసి స్థానికులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే భవన భద్రతపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి తాను విదేశాలకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లోని వస్తువుల భద్రత విషయంలో అతను తీసుకున్న కేర్‌ చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అతను తనకెంతో ఇష్టమైన మహీంద్రా స్కార్పియో కారును పార్కింగ్‌లో ఉంచితే ఎక్కడ దొంగలు ఎత్తుకెళ్లిపోతారో అని ఏకంగా ఇంటిపైకప్పుపైన పార్క్‌ చేసాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సాధారణ పార్కింగ్ స్థలాలు కాకుండా, ఇలా ఇంటి మీదికి కారును ఎక్కించడం చూసి స్థానికులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వీడియో ప్రకారం.. యజమాని తాను తిరిగి వచ్చేవరకు కారు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఇది వినడానికి, చూడటానికి ఫన్నీగా ఉన్నప్పటికీ, దీనివల్ల పలు భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టన్నుల కొద్దీ బరువు ఉండే ఎస్‌యూవీలను ఇళ్ల పైకప్పులపై పార్క్ చేయడం వల్ల భవన నిర్మాణం బలహీనపడే ప్రమాదముంది. అంతేకాకుండా, ఎండ, వర్షాలకు వాహనం పాడవ్వడంతో పాటు భవిష్యత్తులో దానిని కిందకు దించడం పెద్ద సవాల్‌గా మారుతుంది. కార్ల భద్రత కోసం జీపీఎస్ ట్రాకర్లు, సెక్యూరిటీ లాక్‌లు వంటి సురక్షిత మార్గాలు ఉన్నప్పటికీ, ఈ యజమాని మాత్రం ఎవరూ ఊహించని రీతిలో కారును ఏకంగా ఇంటి పైకప్పుపై పార్క్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్పైడర్‌ మ్యాన్‌లా స్టంట్‌ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..

పగలు ఆర్‌ఎంపీ డాక్టర్‌.. రాత్రయితే..

Loading...
Unable to load recommendations.
Follow Us