
ఒక పెళ్లి చేసుకున్నవారే సంసారాన్ని ఈదడానికి తెగ కష్టాలు పడుతుంటారు. కర్మ కాలి రెండవ పెళ్లి చేసుకుంటే.. ఆ కష్టాలు ఎలా ఉంటాయో మనం అడపా దడపా చూస్తూనే ఉంటాం. పూర్వం రాజులు చేసుకున్నారు అంటే వారికి ఉండే సంపద, వైబోగాలు అలాంటివి మరి. కాగా ఇటీవల దుబాయ్‌కి చెందిన ఓ పెద్దాయన తన 28 మంది భార్యల సమక్షంలో గ్రాండ్‌గా 37వ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ కార్యక్రమంలో అతడి 135 మంది పిల్లలు, 126 మనవళ్లు, మనవరాళ్లు పాల్గొన్నారు. ఈ తతంగం చూస్తూ చుట్టూ నిలబడి ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ సంబరాల్లో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన 45 సెకన్ల నిడివి కలిగిన ఓ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోకు రూపిన్ శర్మ , “జీవించి ఉన్న అత్యంత సాహసవంతుడు.. 28 మంది భార్యల ఎదుట 37వ వివాహం” అనే క్యాప్షన్ ఇచ్చారు. వీడియోను ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించారనే వివరాలు తెలియరాలేదు కానీ ఇంటర్నెట్లో తెగ ట్రెండ్ అవుతుంది. ఇక తాత గారి భార్యల బాగోతం చూసి నెటిజన్లు తన క్రియేటివిటీ ఉపయోగించి కామెంట్లు పెడుతున్నారు.
‘ఒక్క పెండ్లే గగనమవుతున్న రోజుల్లో అంతమంది భార్యలతో ఆయన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు’ అని ఓ యూజర్ కామెంట్ పెట్టగా, ‘‘నేనిప్పటి వరకు ఒక్క పెళ్లి చేసుకోవటానికే భయపడి చస్తున్నాను.. నువ్వు మాత్రం 37 పెళ్లిళ్లు చేసుకున్నావు’’… ‘‘ఇది చూస్తే సింగిల్స్ ఔట్’’ అంటూ మరో ఇద్దరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
Also Read: ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.11.30 కోట్లు ఫైన్ వేసిన ఏపీ సర్కార్