Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Updated on: May 31, 2022 | 9:24 AM

ముంబైలో ఓ షాకింగ్‌ ఇన్సిడెంట్ జరిగింది. ఓ హోటల్‌ గదిలో 40 ఏళ్ల ప్రియురాలితో శృంగారం చేస్తుండగా 61 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ముంబైలో ఓ షాకింగ్‌ ఇన్సిడెంట్ జరిగింది. ఓ హోటల్‌ గదిలో 40 ఏళ్ల ప్రియురాలితో శృంగారం చేస్తుండగా 61 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణానికి గల కారణాలపై వైద్యుల నుంచి నివేదిక కోరారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఉదయం సదరు వృద్దుడు సబర్బన్ కుర్లా లోని హోటల్‌కు ఉదయం 10 గంటలకు చెక్ ఇన్ చేశాడు. రిసెప్షన్‌లో పక్కనున్న మహిళ ఎవరూ అని అడిగితే తన ప్రియురాలు అని చెప్పాడు. వారు గదిలోకి వెళ్లిన కొంత సమయం తర్వాత ఆ మహిళ హోటల్ రిసెప్షన్‌కు కాల్ చేసింది. సదరు వృద్దుడు స్పృహ కోల్పోయాడని… స్పందించలేదని చెప్పింది. హోటల్ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే హోటల్ కి వచ్చి వృద్ధుడిని సియోన్‌లోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.అనంతరం మహిళను కుర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఆ వృద్ధుడు వర్లీలో నివాసముంటున్నాడని, ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడని ఆమె పోలీసులకు చెప్పింది. శృంగారం చేస్తుండగా వృద్ధుడు మద్యం తాగేందుకు యత్నించాడని, ఆ సమయంలోనే ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి వెళ్లాడని ఆ మహిళ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. “ప్రాథమిక సమాచారం ఆధారంగా మేము ఈ కేసులో యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట నమోదు చేసాం. మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి అతను శృంగారానికి ముందు ముందు ఏదైనా టాబ్లెట్‌ను సేవించాడో లేదో తెలుసుకోవడానికి డాక్టర్ల రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం.” అని ఓ పోలీస్ అధికారి చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Published on: May 31, 2022 09:24 AM
Loading...
Unable to load recommendations.
Follow Us