ఇంట్లోకి కుక్క వస్తే..100 డయిల్ చేశాడు.. మరి పోలీసుల రియాక్షనేంటి ??
సాధారణంగా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేస్తారు. కానీ ఓ వ్యక్తి తన ఇంట్లో వీధి కుక్క చొరబడిందని దానిని ఇంట్లోంచి వెళ్లగొట్టాలని 100 కు ఫోన్ చేసాడు. ఆపదలో ఉన్నాను రక్షించమంటూ ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లాక ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన విషయం విని షాకయ్యారు. చివరికి కుక్కను బయటకు తరిమి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేస్తారు. కానీ ఓ వ్యక్తి తన ఇంట్లో వీధి కుక్క చొరబడిందని దానిని ఇంట్లోంచి వెళ్లగొట్టాలని 100 కు ఫోన్ చేసాడు. ఆపదలో ఉన్నాను రక్షించమంటూ ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లాక ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన విషయం విని షాకయ్యారు. చివరికి కుక్కను బయటకు తరిమి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాజీపేటకు చెందిన రాజేంద్రకుమార్ అనే వ్యక్తి ఇంట్లోకి రాత్రి 10 గంటల సమయంలో వీధి కుక్క చొర బడింది.. రాజేంద్రకుమార్ బయటకు వెళ్లెగొట్టే ప్రయత్నం చేయగా.. అరుస్తూ కరవడానికి అతనిపైకి రావడంతో భయపడిపోయారు. ఇంట్లోకి దూరిన కుక్కను చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఎంతకీ ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడంతో, చేసేది లేక ఇంటి యజమాని రాజేంద్రకుమార్ భయంతో 100కు డయల్ చేశారు. అప్పటికే సమీప కాలనీల్లో విధులు నిర్వహిస్తున్న ఇంతేజార్ గంజ్ ఠాణా బ్లూకోల్ట్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకొని షాకయ్యారు. అనంతరం ఆ శునకాన్ని బయటకు తరిమికొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుడు టైటాన్.. ఇప్పుడు ట్రిటాన్.. టైటానిక్ కోసం సాహసయాత్ర
పెన్సిల్ లెడ్ పై జీవితచరిత్ర.. యువతి ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా
భానుడి భగభగలు.. ట్రాన్స్‌ఫార్మర్ల ముందు కూలర్లు, ఫ్యాన్లు
Kangana Ranaut: గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ చేసుకున్న బ్యూటీ ?? రూమర్లకు చెక్ పెట్టిన కంగనా