ఆహా.. ఇలాంటి అత్తింటివారుంటే..అల్లుడికి నిత్యం పండగే!

Updated on: May 23, 2026 | 8:56 AM

మహారాష్ట్రలో ఓ అత్తింటివారు తమ అల్లుడికి ఏకంగా 1.5 కిలోల వెండితో తయారుచేసిన కొల్హాపురి చెప్పులను కానుకగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అధిక మాసం సందర్భంగా ఇచ్చిన ఈ ప్రత్యేక బహుమతి కోసం రూ.4.25 లక్షలు ఖర్చు చేశారు. ప్రముఖ కారిగర్ విక్రాంత్ మాలి తొమ్మిది రోజులపాటు శ్రమించి ఈ వెండి చెప్పులను రూపొందించారు.

సాధారణంగా కొత్త అల్లుడికి అత్తింటివారు పండగలకో, పుట్టినరోజుకో ఇలా ఏదో సందర్భంగా కానుకలు ఇస్తుంటారు. అది కూడా కొత్త బట్టలు పెట్టడం, కాస్త కలిగినవారైతే చిన్న చిన్న బంగారు ఆభరణాలు కానుకగా ఇస్తుంటారు. కానీ మహారాష్ట్రలో మాత్రం ఓ అత్తింటివారు అల్లుడికి భారీ గిఫ్ట్‌ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. సంప్రదాయ పండుగ వేళ అల్లుడికి ఇచ్చిన ఆ లగ్జరీ కానుక ముచ్చట్లేంటో చూద్దాం.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ వ్యక్తి.. తన అల్లుడికి ఏదైనా ప్రత్యేమైన బహుమతి ఇవ్వాలని భావించాడు. అందుకోసం ఆయన ఏకంగా వెండితో చెప్పులు తయారుచేయించారు. ఏకంగా 1.5 కిలోల వెండితో కొల్హాపురి చెప్పులు తయారు చేయించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే అధిక మాసం కోసం ఈ వినూత్న కానుకను సిద్ధం చేయించారు. అధిక మాసంలో అల్లుళ్లకు బహుమతులు ఇవ్వడం మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఆనవాయితీగా పాటిస్తారు. సాంగ్లీకి చెందిన ఒక జ్యువెలర్ ద్వారా కొల్హాపుర్‌కు చెందిన ప్రముఖ చర్మకారుడు, వెండి నిపుణుడు విక్రాంత్ మాలికి ఈ వింత ఆర్డర్ అందింది. విక్రాంత్ గత ఇరవై ఏళ్లుగా వెండి నగలు, పాత్రలు తయారు చేస్తున్నారు. కానీ చెప్పులు తయారు చేయడం ఆయనకు ఇదే తొలిసారని వెల్లడించారు. ఈ చెప్పుల కోసం 95 శాతం స్వచ్ఛమైన 1.5 కిలోల వెండిని ఉపయోగించారు. విరిగిపోకుండా ఉండటానికి కాడ్మియం కలిపారు. దీంతో వీటిని షోకేస్‌లో పెట్టడమే కాకుండా సాధారణ చెప్పుల్లా వాడుకోవచ్చు. అసలైన తోలు చెప్పును కొని ఆ డిజైన్‌ను పూర్తిగా అధ్యయనం చేసి విక్రాంత్, తొమ్మిదిరోజులపాటు శ్రమించి వీటిని రూపొందించారు. ఈ చెప్పులు తయారు చేసినందుకు విక్రాంత్ రూ.22 వేలు తీసుకున్నారట. ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ ‘ప్రాడ’ అమ్మే కొల్హాపూరి చెప్పుల ధర రూ.84 వేలు ఉంటే, ఈ అత్తింటివారు ఏకంగా రూ.4.25 లక్షలు ఖర్చు చేసి వెండి చెప్పులు తయారు చేయించారు. విక్రాంత్ గతంలోనూ ఇలాంటి ఎన్నో వింత వస్తువులు తయారు చేశారు. వెండితో కత్తులు, బ్యాట్, బాల్, వాటర్ కంటైనర్లు తయారు చేశారు. శివాజీ మహారాజ్ తలపాగా కూడా వెండితో రూపొందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: జస్ట్ మిస్.. లేదంటే.. వీర భద్రుడిగా బన్నీ రెచ్చిపోయేవాడే

Ananya Nagalla: మూడేళ్లు బ్రేకప్ బాధతోనే బతికా.. శాడ్ బ్రేకప్ స్టోరీ

Jayam Ravi: నెలకు 40 లక్షలు ఇవ్వాల్సిందే! భార్య డిమాండ్ విని.. షాక్‌లో స్టార్‌ హీరో!

Peddi: పెద్ది మూవీకి ఐబొమ్మ టెన్షన్..! భారీ యాక్షన్‌కు సిద్ధమైన మేకర్స్

Dragon: 4 నిమిషాల్లోనే సోషల్ మీడియా షేక్.. డ్రాగన్‌తో ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్

Follow Us