నవరాత్రుల శుభవేళ ఆలయంలో అద్భుతం
దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో ఎనిమిదవరోజు అమ్మవారు సరస్వతీదేవిగా పూజలందుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలతోపాటు వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలోని ప్రముఖ శివాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తులు ఇదంతా స్వామివారి మహిమేనని భక్తితో నమస్కరించారు.
నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో నాగుపాము సంచారం కలకలం రేపింది. ఆలయం పరిసరాల్లోని క్యూలైన్ సమీపంలో నాగుపాము కనిపించడంతో భక్తులు ఒకింత భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆలయ సిబ్బందికి సమాచారమివ్వడంతో తక్షణం స్పందించిన వారు భక్తులను భయపడవద్దని, స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోని దిగిన స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును చాకచక్యంగా పట్టుకొని సమీపంలోని నల్లమల అడవిలో వదిలిన పెట్టాడు. నాగుపాము పట్టుబడడంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆలయంలో పామును చూడగానే మొదట భయపడినా.. నవరాత్రుల శుభవేళ శివాలయంలో ఇలా నాగుపాము కనిపించడం దైవలీల అని, పరమేశ్వరుడే ఇలా దర్శనమిచ్చారని కొందరు భక్తులు నాగదేవతకు భక్తితో మ్రొక్కారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డు మధ్యలో క్షుద్రపూజలు.. భయాందోళనలో స్థానికులు
ఛీ !! విజయ్ తీరుపై కట్టప్ప షాకింగ్ రియాక్షన్
‘ చెప్పాల్సింది చెప్పేశా. ఇంకేమీ లేదు’
నిద్రిస్తుండగా ఘోర ప్రమాదం !! వీర హనుమాన్ చైల్డ్ ఆర్టిస్ట్ మృతి
Shanmukh Jaswanth: బిగ్ బాస్‌కి అనవసరంగా వెళ్లా.. నా జీవితం ఫినిష్ అనుకున్నా
