నడిరోడ్డుపై రెచ్చిపోయిన లవర్స్‌.. బైక్‌పై కూర్చుని మరీ..

|

Jan 07, 2023 | 9:46 AM

నడిరోడ్డుపై ప్రేమికులు రెచ్చిపోయారు. విచ్చలవిడితనానికి పరాకాష్టగా మారింది వీరి వికృత చేష్ట. పట్టపగలు బైక్‌పైన అభ్యంతరకరమైన రీతిలో దూసుకుపోయారు.

నడిరోడ్డుపై ప్రేమికులు రెచ్చిపోయారు. విచ్చలవిడితనానికి పరాకాష్టగా మారింది వీరి వికృత చేష్ట. పట్టపగలు బైక్‌పైన అభ్యంతరకరమైన రీతిలో దూసుకుపోయారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రోడ్డులో బైక్‌పై ఓ యువకుడు స్కూల్‌ యూనిఫారం ధరించి ఉన్న ఓ యువతిని బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకుని కనీసం హెల్మెట్‌ కూడా ధరించకుండా రయ్‌మంటూ దూసుకెళ్ళారు. పక్కనే ఇతర వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఓ కారులో వెళ్తున్న వ్యక్తులు ఈ దృష్యాన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో వైరల్‌గా మారిన ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఆయువతి, యువకుడి కోసం గాలింపు చేపట్టారు. గాజువాక సమీప వెంపలినగర్‌, సమతానగర్‌కు చెందిన ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసామని, అంతేకాదు, ఇరువురి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చినట్టు స్టీల్‌ప్లాంట్‌ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ స్వామినాయుడు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడేం మొగుడండి బాబు.. నడిరోడ్డుపై భార్యను మరచి వెళ్లిపోయాడు !!

కారు డిక్కీ తెరిచి పోలీసుల షాక్.. బ్యాగుల మధ్య చూసి ఫ్యజుల్ అవుట్..

నడిరోడ్డుపై పడగవిప్పి అడ్డంగా నిల్చున్న నాగుపాము.. భారీగా ట్రాఫిక్ జామ్..

బెడిసి కొట్టిన వధూవరుల రొమాంటిక్‌ సీన్‌ !! నెట్టింట వైరల్

NTR ఘనతను.. ఎందుకు గుర్తించట్లేదు.. మంచు లక్ష్మీ సూటి ప్రశ్న..

 

Published on: Jan 07, 2023 09:46 AM