మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్‌ జీపీటీని అడగండి.. ఇట్టే దొరికేస్తాయ్‌

Updated on: Aug 18, 2026 | 6:18 PM

గోవాకు చెందిన శుభాంగ్ బోర్కర్‌ ఉజ్జయిని మహాకాళ్‌ ఆలయంలో చెప్పులు కనిపించకపోవడంతో వినూత్నంగా చాట్‌జీపీటీ సాయం తీసుకున్నాడు. చెప్పుల ఫొటోతో పాటు చెప్పుల స్టాండ్‌ ప్రాంతానికి సంబంధించిన వీడియోను ఏఐకి అప్‌లోడ్‌ చేశాడు. వీడియోను విశ్లేషించిన చాట్‌జీపీటీ, చెప్పులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించడంలో సహాయపడింది. వెళ్లి చూడగా చెప్పులు అక్కడే కనిపించాయి. ఈ అనుభవాన్ని సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో ఏఐ సామర్థ్యాలపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చెప్పులు పోవడమేంటి.. చాట్‌జీపీటీని అడగడమేంటి అనుకుంటున్నారా.. నిజం.. చాట్‌ జీపీటీ మీ చెప్పలు వెతికిపెడుతుంది. టెక్నాలజీ మన దైనందిన జీవితంలో ఎంతగా భాగం అయిపోయిందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. సాధారణంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో చెప్పులు పోగొట్టుకోవడం లేదా ఎక్కడ పెట్టామో మర్చిపోవడం చాలా మందికి జరిగే పనే. కానీ, గోవాకు చెందిన ఓ యువకుడు మాత్రం దీనికోసం ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ట్రిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గోవాకు చెందిన శుభాంగ్ బోర్కర్ అనే యువకుడు ప్రసిద్ధ ఉజ్జయిని మహాకాళ్ ఆలయాన్ని సందర్శించాడు. దర్శనం ముగించుకుని బయటకు వచ్చాక చెప్పుల స్టాండ్‌లో వందలాది జతల చెప్పుల మధ్య తన చెప్పులు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోలేకపోయాడు. అక్కడి రద్దీలో వాటిని గుర్తించడం అతనికి పెద్ద సవాల్‌గా మారింది. దీంతో అతను ఒక వినూత్న ఆలోచన చేశాడు. తన దగ్గర ఉన్న ఫోన్‌తో ఆ ప్రాంతమంతా వీడియో తీశాడు. తన చెప్పుల ఫోటోను రిఫరెన్స్‌గా ఇస్తూ, ఆ వీడియోను చాట్‌జీపీటీకి అప్‌లోడ్ చేశాడు. ఆశ్చర్యకరంగా.. ఆ వీడియోను విశ్లేషించిన చాట్‌జీపీటీ, ఆ రాక్‌లో ఏ స్థానంలో అతని చెప్పులు ఉన్నాయో కచ్చితమైన లొకేషన్‌ను చూపించింది. అతను వెళ్లి చూడగా నిజంగానే అక్కడ అతని చెప్పులు ఉన్నాయి. ఈ మొత్తం అనుభవాన్ని వీడియో తీసి అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఏఐ ఇమేజ్ అనాలిసిస్ సామర్థ్యాలను ఇలా సరదాగా, వినూత్నంగా వాడటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్‌లో వాడారంటూ ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!

రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం

హాస్టల్‌లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు

ప్రభుత్వ పాఠశాలల్లో ఇక ఇడ్లీ-సాంబార్‌..

అంగారకుడిపై నీళ్లే కాదు.. రత్నాలు కూడా.. బయటపడ్డ రహస్యం..

Loading...
Unable to load recommendations.
Follow Us