Little Boy: కటింగ్ చేయించుకుంటూ బుడ్డోడి ఏబీసీడీ పాట చూస్తే ఎవరైనా మెస్మరైజ్ కావలసిందే! Viral Video

Little Boy: చిన్నపిల్లలు అందులోనూ వచ్చీరాని మాటలతో మాట్లాడే పిల్లలను చూస్తే మనసుకు ఎంతో హాయి అనిపిస్తుంది. వారిని అర్జంట్ గా ఎత్తుకుని ముద్దు పెట్టేసుకోవాలనిపిస్తుంది. వారు చేసే చిలిపి పనులు చూస్తే ముచ్చటగా అనిపిస్తుంది.

Little Boy: కటింగ్ చేయించుకుంటూ బుడ్డోడి ఏబీసీడీ పాట చూస్తే ఎవరైనా మెస్మరైజ్ కావలసిందే! Viral Video
Little Boy

Updated on: May 25, 2021 | 7:55 PM

Little Boy: చిన్నపిల్లలు అందులోనూ వచ్చీరాని మాటలతో మాట్లాడే పిల్లలను చూస్తే మనసుకు ఎంతో హాయి అనిపిస్తుంది. వారిని అర్జంట్ గా ఎత్తుకుని ముద్దు పెట్టేసుకోవాలనిపిస్తుంది. వారు చేసే చిలిపి పనులు చూస్తే ముచ్చటగా అనిపిస్తుంది. ఒక్కోసారి వాళ్ళు అల్లరిగా ప్రవర్తించినా వారి అమాయకపు మొహం చూస్తే ముద్దుగా అనిపిస్తుంది. అన్నీ కరోనా వార్తలు చదివీ.. వినీ పిచ్చెక్కుతున్నట్టు అనిపిస్తున్న తరుణంలో ఆప్పుడప్పుడు ఇటువంటి వీడియోలు చూస్తే ప్రాణం లేచివచ్చినట్టు అనిపిస్తుంది. సరిగ్గా అటువంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. కరోనా కారణంగా బయటకు వెళ్లి కటింగ్ చేయించుకునే పరిస్థితి ఎవరికీ లేదు. ఇంట్లోనే చేయించుకోవాల్సి వస్తోంది. ఇక చిన్న పిల్లలను బయటకు తీసుకెళ్ళి జుత్తు కత్తిరించుకునేలా చేయడం అసలు కుదరదు. అందుకే ఈ బుడ్డోడికి ఇంట్లోనే ఆ పని చేయిస్తున్నారు. సరే, పిల్లలు కటింగ్ చేస్తుంటే రకరకాలుగా కదిలిపోయి కట్ చేసేవారికి చెమటలు పట్టిస్తారు. మరి ఈ పిల్లోడు చేస్తున్న పనికి భలే ముద్దు వచ్చేస్తుంది..

ఈ వీడియోలో, ఈ అందమైన పిల్లవాడు ఎరుపు రంగు కుర్చీపై కూర్చున్న హ్యారీకట్ చేయించుకోవడం కనిపించింది. అనుష్రుత్ అనే ఈ బుడ్డోడు తన బార్బర్ తో సంభాషిస్తున్నాడు. విమానం మామ అతనిని పట్టుకోవడంతో జుట్టు కత్తిరించేటప్పుడు నిశ్శబ్దంగా ఉండమని కోరడంతో వీడియో ప్రారంభమవుతుంది. తరువాత, అనుశ్రుత్ హ్యారీకట్ పొందేటప్పుడు ఎబిసిడిని చెప్పడం ప్రారంభించాడు. తన ఎబిసిడి ప్రాసను పూర్తి చేసిన తర్వాత అక్కడ ఉన్నవారు చప్పట్లు కొట్టి ప్రశంసించడం చూసి చలా ఆనందిస్తున్నాడు. అతని అందమైన వ్యక్తీకరణలు మిలియన్ల హృదయాలను ఉల్లాస పరిచాయి. ఈ బుడ్డోడు కొద్ది నిమిషాల పాటు ప్రపంచపు ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొన్ని సానుకూల సంబరాన్ని అందించాడు.
ఈ వీడియో చూడండి..

అనట్టు గతంలో కూడా ఈ బుడ్డోడు అనుశ్రుత్ వీడియోల్లో కనిపించాడు. కనిపించిన ప్రతిసారి అందరినీ అలరించాడు.

Also Read: Bangalore: కరోనా పేషెంట్స్ లో ఉత్సాహాన్ని నింపడానికి బెంగళూరులో వైద్యసిబ్బంది డ్యాన్స్..Viral Video

Viral Video: తినేట‌ప్పుడు కూడా ఫోన్‌లో ముఖం పెట్టిన వ్య‌క్తి.. అత‌డి భార్య ఎలా తిక్క కుదిర్చిందో చూడండి