Viral Video: పిడుగుపాటు గురించి మనం నిత్యం వార్త పత్రికల్లో, న్యూస్ ఛానల్స్‌లో వినే ఉంటాం. అయితే ఎప్పుడూ ప్రత్యక్షంగా చూసి ఉండం. భారీ వర్షాలు కురిసే సమయంలో ఆకాశం నుంచి పిడుగులు పడుతుంటాయి. అడపాదడపా ఇలాంటి పిడుగుపాటులకు సంబంధించిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కుతూ ఉంటాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియేనే ఒకటి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అమెరికాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో కొన్ని చోట్ల భారీగా వర్షాలు, టోర్నడోలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారీగా వర్షం కురుస్తుండంతో ఓ వ్యక్తి తన కారును రోడ్డు పక్కన ఆపుకొని మొబైల్ ఫోన్‌లో వాతావరణంలో జరుగుతోన్న మార్పులను రికార్డు చేస్తున్నాడు. అప్పుడే ఎదురుగా ఓ కారు నెమ్మదిగా వెళుతోంది.
ఇదే సమయంలో ఆకాశంలోని నుంచి ఏదో లైట్ కారుపై పడినట్లు కనిపించింది. నిజానికి అది పిడుగు పాటు అని గమనించలేదు. అయితే అనంతరం ఆ వీడియోను స్లో మోషన్‌లో చూస్తే కానీ తెలియలేదు, కారుపై పిడుగుపాటు పడిందని. ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. దీంతో వైరల్ అవుతోంది. కారుపై పిడుగు రెప్పపాటులో పడడం నెటిజన్లను ఆశ్చర్యపోతున్నారు.
Also Read: Fraction Shares: చిన్న పెట్టుబడిదారులకు శుభవార్త.. ఇకపై ఖరీదైన షేర్లను సులువుగా కొనవచ్చు..
Chanakya Niti: డబ్బులు నిలవాలంటే ఇలా అస్సలు చేయకండి.. చాణక్యుడు చెప్పిన రహస్యం ఇదే..