ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..

Updated on: May 27, 2026 | 3:40 PM

సుప్రీంకోర్టు నకిలీ ఉత్తర్వులతో జీవిత ఖైదీ శంకర్ ఆర్ముగం బెంగళూరు జైలు నుంచి విడుదలైన ఘటన సంచలనంగా మారింది. అనారోగ్య కారణాలతో విడుదల ఆదేశాలంటూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి 2018లో బయటకు వచ్చిన అతని మోసం 9 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టగా, జైలు అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశాలంటూ నకిలీ ఉత్తర్వులను చూపి ఓ ఖైదీ దర్జాగా సినిమా స్టైల్‌లో విడుదలయ్యాడు. 9 ఏళ్ల తరువాత ఈ వ్యవహారం వెలుగులోకి రాగా ఖైదీ కోసం పోలీసులు పరుగులు పెట్టారు. తమిళనాడుకి చెందిన జీవితఖైదీ శంకర్‌ ఆర్ముగం బెంగళూరులొ ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి తన ముఠాతో హత్య చేయించాడు. కేసు విచారణ తరువాత బెంగళూరు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు శంకర్‌ ఆర్ముగంకు యావజ్జీవిత శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. దీంతో బెంగళూరు పరప్సన అగ్రహార జైలుకు శంకర్‌ను తరలించారు. అయితే శంకర్‌ జైలు నుంచి బయటకు రావడానికి ఓ పథకం వేశాడు. అనారోగ్య కారణాల వల్ల తనను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ముద్ర, జడ్జి సంతకం ఉన్న నకిలీ రికార్డును సృష్టించాడు. 2018 నవంబర్‌ 13న నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వులను చూపించాడు. అధికారులు నిజమే అనుకుని అతనిని విడుదల చేసారు. అయితే.. ఇటీవల జైళ్ల శాఖ డీజీపీకి ఒక గుర్తుతెలియని లేఖ వచ్చింది. శంకర్‌ ఆర్ముగం నకిలీ రికార్డు గురించి ఆ లేఖలో ప్రస్తావించారు. దీంతో జైలు అధికారులు విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు నుంచి అలాంటి విడుదల ఆదేశాలు రాలేదని స్పష్టమైంది. దాంతో అతని మీద స్థానిక పోలీసులకు జైలు అధికారులు ఫిర్యాదు చేయగా, గాలింపు చేపట్టారు. అతడిపై పోలీసులు ఫోర్జరీ, మోసం సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సుప్రీం ఉత్తర్వులు అనగానే ఖైదీని ఎలా విడుదల చేశారు ఇందులో జైలు అధికారులు కుమ్మక్కయ్యారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఈ మోసం.. కర్ణాటక జైళ్ల శాఖలో విధానపరమైన లోపాల్ని, అంతర్గత కుమ్మక్కులను బయటపెట్టింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!

రూ.100 మ్యాగీ, ఓ కూల్ డ్రింక్ బాటిల్..బాలుడి బర్త్‌డే వేడుకలు వైరల్‌

Follow Us