Creativity Video: ఏం క్రియేటివిటీ గురూ.. నీ ఐడియాకి ఇంజనీర్లు సైతం సలాం కొట్టాల్సిందే.. !
తెలివి అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు.. ప్రతీ ఒక్కరూ తమ తెలివితేటలను, సామర్ధ్యాన్ని ఏదొక సమయంలో బయటపెడుతుంటారు. గొప్ప గొప్ప ఇన్వెన్షన్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటీవల కాలంలో
తెలివి అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు.. ప్రతీ ఒక్కరూ తమ తెలివితేటలను, సామర్ధ్యాన్ని ఏదొక సమయంలో బయటపెడుతుంటారు. గొప్ప గొప్ప ఇన్వెన్షన్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో సామాన్యులు చేస్తోన్న సరికొత్త ఇన్వెన్షన్లు.. ఇంజినీర్లను సైతం సలాం కొట్టేలా చేస్తున్నాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు.. ఇప్పటివరకూ మనం బొగ్గులు ఉపయోగించో, కరెంట్ ఉపయోగించో ఐరన్ చేయడం చూసాం. అయితే గ్యాస్ సిలిండర్‌తో ఇస్త్రీ చేస్తుండటం ఎప్పుడైనా చూశారా.? ఇదిగో ఇక్కడ చూడండి.. ఈ వ్యక్తి గ్యాస్ సిలిండర్ సహాయంతో బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు. అసలు గ్యాస్ సిలిండర్‌కి, ఇస్త్రీ పెట్టెకి కనెక్షన్ ఎలా ఇచ్చాడో కానీ చకచకా ఐరన్ చేసేస్తున్నాడు. ఇదెలా సాధ్యమని అతన్నే అడిగితే.. ఏమో తెలియదంటాడు.. గత నాలుగేళ్లుగా ఈ విధంగానే బట్టలు ఇస్త్రీ చేస్తున్నానని అతడు చెబుతున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నువ్వు చేసేపని ఎలా చేస్తున్నావో నీకే తెలియకపోతే ఎలారా సామీ అంటూ తలలు పట్టుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?