ఫస్ట్ టైం లాటరీ టికెట్ కొని.. పాతిక కోట్లు గెలిచిన పెయింటర్

Updated on: Oct 10, 2025 | 3:32 PM

ల‌క్ అంటే అత‌నిదే. ఎంతో మందికి ఏళ్ల‌కు ఏళ్లుగా ఎదురు చూస్తున్నా ద‌క్క‌ని అదృష్టం.. అత‌డ్ని మాత్రం వెంట‌నే వ‌రించింది. ఫ‌స్ట్ టైమ్ కొన్న లాట‌రీ టికెట్‌తోనే ఓవ‌ర్‌నైట్‌ కోటీశ్వ‌రుడు అయిపోయాడు. ఒక‌టి రెండు కాదు ఏకంగా 25 కోట్ల రూపాయ‌ల బంపర్ లాట‌రీ కొట్టాడు. 'నువ్వు చాలా ల‌క్కీ బ్రో' అంటూ నెటిజ‌న్లు అత‌డికి విషెస్ చెబుతున్నారు.

ఇంత‌కీ ఎవ‌ర‌త‌ను? కేరళ అలప్పుజ జిల్లా తైకట్టుస్సేరీ నివాసి శరత్‌ నాయర్‌ వృత్తిరీత్యా పెయింటర్‌. తిరువోణం బంపర్‌ లాటరీలో రూ.25 కోట్ల బహుమతి గెలుచుకున్నారు. నాయర్‌ ఎలాంటి ఆర్భాటం లేకుండా సోదరుడితో కలిసి సోమవారం తన లాటరీ టికెట్‌ను స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు వెళ్లి అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అక్టోబర్‌ 3న ఫలితాలు ప్రకటించినప్పుడు ఆ గెలిచిన టికెట్ తన జేబులోనే ఉందని తెలిసి నమ్మలేకపోయాననీ తరువాత, ఇంటికి వెళ్లి టికెట్‌ను పరిశీలించి నిర్ధారించుకున్నానని నాయర్‌ తెలిపారు. ఇది నిజమని పూర్తిగా నిర్థారించుకున్న తర్వాతే అందరితో ఈ వార్త పంచుకున్నానని ఆయన తెలిపారు. తాను గతంలో చిన్న చిన్న లాటరీ టిక్కెట్లు కొన్నప్పటికీ.. బంపర్ టికెట్ కొనటం ఇదే మొదటిసారని శరత్‌ నాయర్‌ స్పష్టం చేశారు. రూ. 25 కోట్ల మొత్తంతో ఏం చేస్తారని ప్రశ్నించగా.. తానింకా ఏం నిర్ణయించుకోలేదన్నారు. తనకున్న అప్పులు తీర్చాక.. కుటుంబంతో కలిసి భవిష్యత్తు గురించి చర్చిస్తానని అన్నారు. పెయింట్‌ షాప్‌లో ఇంకా పనిచేస్తారా? అని ప్రశ్నించగా.. 12 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నానని, ఇకపైనా.. అక్కడ పనిచేస్తానని సమాధానమిచ్చారు. కేరళ రాష్ట్ర లాటరీల విభాగం నిర్వహించే లాటరీలన్నిటిలోనూ.. అత్యధిక మొత్తం మొదటి బహుమతి తిరువోణం బంపర్‌దే కావడం విశేషం. టాక్స్‌లు కమిషన్లు పోను శరత్‌ నాయర్‌ చేతికి 15.75 కోట్ల రూపాయలు అందే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్‌.. రైలు టికెట్లు రద్దు చేయాల్సిన పనిలేదు