గాడిదను ఎగిరెగిరి తన్నిన యజమాని.. దెబ్బకు సీన్ రివర్స్.. కర్మఫలం అంటే ఇదే తమ్ముడూ అంటున్న నెటిజెన్స్

|

Jul 30, 2022 | 9:52 AM

ఒక మూగజీవిని అకారణంగా హింసిస్తే ఏం జరుగుతుందో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఈ వీడియోలో ఒక గాడిదను తన యజమాని ఇష్టం వచ్చినట్లు తన్నుతున్నాడు.

ఒక మూగజీవిని అకారణంగా హింసిస్తే ఏం జరుగుతుందో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఈ వీడియోలో ఒక గాడిదను తన యజమాని ఇష్టం వచ్చినట్లు తన్నుతున్నాడు. దాంతో ఆ యువకుడి తిక్కకుదిర్చించింది ఆ గాడిద. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ పొలంలో గట్టుమీద ఓ గాడిద కట్టేసి ఉంది. ఆ గాడిదను ఓ యువకుడు ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు. కాలుతో దాని ముఖం మీద తన్నుతున్నాడు. చేత్తో గాడిద రెండు చెంపలూ వాయిస్తున్నాడు. నిజానికి గాడిదకు సహనం ఎక్కువ. గాడిద అధికబరువును కూడా ఎంతో దూరం మోసుకెళ్తుంది. అలాంటి గాడిద తన సహనాన్ని కోల్పోయింది. ఆ యువకుడు చేసిన పనికి తగిన బుద్ధి చెప్పింది. ఎగిరెగిరి తన్నుతున్న ఆ యువకుడి కాలుని తన నోటితో గట్టిగా పట్టుకొని కొరికి పారేసింది. అతను ఎంత గింజుకున్నా వదిలిపెట్టలేదు.. ఈవీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తిక్క కుదిర్చింది.. గాడిదే కదా అని గాడితప్పితే.. అలాగే ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయింది ఈ పక్షి !!

Viral Video: అమాంతం బైక్ తో సహా కారును గుద్దేశాడు.. క్షణాల్లో గాల్లోనే కలిసిపోయిన ప్రాణాలు

Viral: ఈ చిలుక ఇంగ్లీష్‌ ముద్దుగా ముద్దుగా మాట్లాడుతూ అదరగొడుతుందిగా.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే

స్విమ్మింగ్‌ పూల్‌లో సింక్‌ హోల్‌ !! ఈత కొడుతున్న వ్యక్తి అమాంతం ??

Pranitha Subhash: పతియే ప్రత్యక్ష దైవం అంటూ పాద పూజ చేసిన ప్రణీత

 

Published on: Jul 30, 2022 09:52 AM