ఎండ ఉన్నంతసేపు ఉరుకతనే ఉంటది..కాకినాడ కుర్రోడి ఖతర్నాక్ ఐడియా వీడియో
సాధించాలనే పట్టుదల ఉండి, దానికి తోడు కృషి ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని చాటాడు కాకినాడ కుర్రాడు. తన ఆలోచనలతో ఓ సరికొత్త వాహనం రూపొందించాడు. కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామానికి చెందిన భాను ప్రకాష్.. జేఎన్టీయూలో ఎంటెక్ చదువుతూనే సోలార్ వెహికల్స్, చార్జింగ్ వెహికల్స్ హ్యూమన్ హైబ్రిడ్ వెహికల్స్ తో కొత్త ఆవిష్కరణలు సృష్టించడం స్టార్ట్ చేశాడు. తాజాగా సూర్యుడు ఉన్నంతసేపు వెహికల్ రన్ అయ్యేలా ఒక సరికొత్త వాహనాన్ని డిజైన్ చేశాడు.
మరోవైపు ట్రైన్ కి ఏ విధంగా ఎలక్ట్రికల్ వైర్ సపోర్ట్ సిస్టం ఉంటుందో అదే విధంగా రోడ్డు మీద కూడా టూ వీలర్ త్రీ వీలర్స్ వెళ్లేలా డిజైన్ చేశాడు. భానుప్రకాశ్ కొత్త కొత్త ఇన్నోవేషన్ తో సరికొత్తగా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు. తనకు సపోర్ట్ చేస్తే మరింత కష్టపడతానని భాను ప్రకాష్ చెప్తున్నాడు. ఇటువంటి వెహికల్స్ వల్ల పొల్యూషన్ కూడా ఉండదు.. ఈజీ మూమెంట్ ఉంటుంది.. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నాడు.. ప్రస్తుతానికి అన్ని నామమాత్రపు వస్తువులతో వీటిని ఆవిష్కరించినప్పటికీ..పెట్టుబడి పెడితే మరింత ఐడియాలజీతో ఈ వాహనాలను అప్డేట్ చేయవచ్చని చెప్తున్నాడు.గతంలో ఈ మోడల్స్ తో లక్షలు పెట్టి తయారు చేసిన ఇన్నోవేషన్స్ ఉన్నాయి. కానీ వాటి అన్నింటికీ అప్డేట్‌గా భాను ఆలోచించాడు. ఇందులో ఇద్దరు నుంచి ముగ్గురు కూర్చునేలా వెహికల్స్ డిజైన్ చేశాడు. ఈ వెహికల్స్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుందని భాను చెప్తున్నాడు.
మరిన్ని వీడియోల కోసం :
తురకపాలెం బాధితుల్లో మెలియాయిడోసిస్ లక్షణాలు గుర్తింపు వీడియో
నర్సరీలో వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూసిన కూలీలకు షాక్ వీడియో