రీల్ స్టోరీ కాదు.. రియల్ కహానీ.. ముంబైలో గుట్టుగా రెండో కాపురం పెట్టాడు.. ఆ తరువాత
ఆకర్షణ ఎంతవరకైనా తీసుకెళ్తుంది. కోరిక ఎంత పనైనా చేయిస్తుంది. అలాంటి కథే జగిత్యాల జిల్లా వెంకటేశ్ ది. ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రియురాలు సినిమా తరహాలోనే జరిగిన ఈ సంఘటన జగిత్యాల జిల్లా కల్లెడలో సంచలనంగా మారింది. వెంకటేశ్, స్వప్న మధ్య ఏర్పడ్డ పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. పెద్దల భయంతో 2015లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
పొట్టకూటి కోసం ముంబై బాట పట్టారు. కొంతకాలానికి ఓ పండంటి కొడుకు పుట్టాడు. అతడికి మౌర్యన్ అని పేరు కూడా పెట్టుకున్నారు. భార్యభర్తల కాపురం అన్యోన్యంగా సాగిపోతున్న క్రమంలో వెంకటేశ్ కు మరో యువతితో ముంబైలో పరిచయం ఏర్పడింది. స్వప్నకు ఏవో మాయమాటలు చెప్పి సొంతూరు కల్లెడకు పంపించాడు. అప్పుడప్పుడు వచ్చిపోతూ స్వప్నకు, కొడుకుకు కావల్సిన సౌకర్యాలు సమకూరుస్తూ తిరిగి వెళ్లిపోయేవాడు. ఈ క్రమంలో ముంబైలో పరిచయమైన యువతిని వెంకటేశ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. భర్తపై స్వప్నకు అనుమానం రావడంతో అతడిని నిలదీసింది. పెద్దల పంచాయితీ వరకు వెళ్లింది. వాళ్ల తీర్మానం మేరకు స్వప్నను మళ్లీ ముంబై తీసుకెళ్తానని చెప్పాడే తప్ప వెంకటేశ్ ఆ పని చేయలేదు. దాంతో స్వప్నకు అనుమానం మరింత రెట్టింపైంది. ఆరా తీస్తే వెంకటేశ్ కు మరో పెళ్లైనట్టు తేలింది. దీంతో కల్లెడలో వెంకటేశ్ ఇంటి ముందు స్వప్న తన కొడుకు మౌర్యన్ తో కలిసి న్యాయపోరాటానికి దిగింది. జగిత్యాల రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు. స్వప్నకు సర్దిచెప్పారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశ్ తో సహా, అతడికి సహకరించిన ఆరుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారుడిని.. చెట్టుకు కట్టేసిన కాంట్రాక్టర్
గుడికి వెళ్లి వస్తుంటే.. రోడ్డుపై దొరికిన డబ్బు సంచి..
‘అజ్మల్ అమ్మాయిలను వేధిస్తాడు.. నన్ను కూడా ..’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
శిరీష్ ఎంగేజ్‌మెంట్‌పై వర్షం దెబ్బ.. ఆగమైన ఏర్పాట్లు..! శిరీష్ ఎమోషనల్
