నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??

|

Dec 23, 2024 | 6:57 PM

ప్రజల అమాయకత్వాన్ని క్యాష్‌ చేసుకునే వాళ్లను చూశాం. ఇప్పుడు ప్రజల భయాన్ని కూడా కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిసర ప్రాంతాల్లో వెలుగుచూసిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. ముమ్మిడివరం పరిధిలోని కేశనపర్రులో పాము రాళ్లు అంటూ ఇద్దరు మోసగాళ్లు ప్రజలను బురిడీ కొట్టించారు.

పాము తల నుంచి తీసిన రాళ్లు దగ్గరుంటే విష సర్పాలు దరిచేరవని జోరుగా ప్రచారం చేశారు. పాములు, తేళ్లు, జెర్రెలు కుట్టిన ప్రదేశంలో పాము తల నుంచి తీసిన రాయి ఉంచితే ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పి పొలాల్లో పనులు చేసుకునే రైతులను, కూలీలను నమ్మించారు. గ్రామాల్లో పాములను పట్టి.. రైతుల సమక్షంలో వాటి తలలో ఉన్న రాళ్లను తీసి నమ్మబలికి అమ్మేశారు ఇద్దరు వ్యక్తులు. రైతుల ముందే ఓ పాము నుంచి రెండు రాళ్లను తీసిన మోసగాళ్లు.. ఒక్కొక్క రాయిని 500 నుంచి 1000 రూపాయలకు అమ్మారు. ఈ సందర్భంగా.. ఆడపాము తలలో నాలుగు రాళ్లు, మగ పాము తలలో రెండు రాళ్లు ఉంటాయని చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యూట్ లుక్స్ కుర్రకారుని ఇట్టే పడేస్తున్న మాడ్ బ్యూటీ శ్రీ గౌరి..