Iron Pillar: ఒక్క క్షణం ముందు జరిగితే.. ఏం జరిగి ఉండేదో..? సీసీ కెమెరా విజువల్స్ వైరల్..

Updated on: Jul 01, 2023 | 4:33 PM

కర్ణాటకలోని హుబ్బళ్లిలో వాహనాల రాకపోకలతో బిజీగా ఉన్న రోడ్డుపై సడెన్ గా ఓ ఐరన్ పిల్లర్ పడిపోయింది. కొద్ది క్షణాల ముందే ఓ వాటర్ ట్యాంకర్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. బైక్ లు, వాటి వెనకే ఓ బస్సు అటువైపే వెళుతున్నాయి.

కర్ణాటకలోని హుబ్బళ్లిలో వాహనాల రాకపోకలతో బిజీగా ఉన్న రోడ్డుపై సడెన్ గా ఓ ఐరన్ పిల్లర్ పడిపోయింది. కొద్ది క్షణాల ముందే ఓ వాటర్ ట్యాంకర్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. బైక్ లు, వాటి వెనకే ఓ బస్సు అటువైపే వెళుతున్నాయి. ఇంతలో పిల్లర్ కూలిపోతుండడం గమనించి బైకర్లతో పాటు వాహనాలు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఒక్క క్షణం అటూ ఇటూగా అయినా వాహనదారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అడుగుదూరంలో కళ్లముందే పెద్ద ఐరన్ పిల్లర్ కూలడంతో ఆ బైకర్లు షాక్ కు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడం, ఆ ఫుటేజీ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైల్వే అండర్ బ్రిడ్జి ముందు ఈ పిల్లర్ ను అధికారులు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కింది నుంచి వెళ్లే వాహనాలకు ఎత్తుకు సంబంధించిన హెచ్చరిస్తూ ఏర్పాటు చేసిన పిల్లర్ ఇది. ఇటీవల పలు వాహనాలు ఢీ కొట్టడంతో పిల్లర్ బలహీనంగా మారిందని రైల్వే అధికారులు తెలిపారు. నిత్యం బిజీగా ఉండే రోడ్డు కావడంతో వాహనాల రాకపోకల సందర్భంగా ఏర్పడే వైబ్రేషన్ కు పిల్లర్ మరింత బలహీనంగా మారి సడెన్ గా కూలిపోయిందన్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..

Loading...
Unable to load recommendations.
Follow Us