ఇన్‌స్టాలో ప్రేమించాడు.. డబ్బులిచ్చి ఆదుకున్నాడు.. చివరికి ??
Insta Love

ఇన్‌స్టాలో ప్రేమించాడు.. డబ్బులిచ్చి ఆదుకున్నాడు.. చివరికి ??

Updated on: Aug 14, 2022 | 9:32 AM

తిరుపతికి చెందిన 18 ఏళ్ల నిఖిల్ కుమార్ ఏడాది కాలంగా నేహ రాజ్‌పుత్‌ అనే యువతితో ఇన్‌స్టా లో చాట్ చేస్తున్నాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది.

తిరుపతికి చెందిన 18 ఏళ్ల నిఖిల్ కుమార్ ఏడాది కాలంగా నేహ రాజ్‌పుత్‌ అనే యువతితో ఇన్‌స్టా లో చాట్ చేస్తున్నాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ నుంచి పెళ్లి వరకు ఎన్నో విషయాలను ఆమెతో పంచుకున్నాడు. ఇద్దరూ మొబైల్ నెంబర్స్ కూడా మార్చుకున్నారు. నేహా మాత్రం నిఖిల్‌కు ఎప్పుడూ కాల్ చేయలేదు గానీ.. నిఖిల్ మాత్రం ఆమెకు తరచూ కాల్ చేసేవాడు. అయితే ఆ యువతి అతడి కాల్స్ లిఫ్ట్ చేసేది కాదు.. అంతేకాకుండా చాట్ చేస్తున్న సమయంలో ఆమె.. తన తండ్రితో విదేశాలకు వెళ్లినట్లుగా చెబుతుండేది. ఇంతవరకు బాగానే ఉంది కదా! ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్‌.. తన తల్లి కాలుకి ఫ్రాక్చర్ అయిందని.. ప్రస్తుతం ఐసీయూలో సీరియస్ కండిషన్‌లో ఉందని.. డబ్బులు సాయం చేయమంటూ ఆ యువతి.. నిఖిల్‌కు మెసేజ్ పెట్టింది. మనోడేమో ప్రియురాలు కష్టాల్లో ఉందనుకుని.. తల్లిదండ్రులకు తెలియకుండా 5 లక్షలు ఆమె అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అంతే! ఆ యువతి ఇన్‌స్టా ఖాతా డీయాక్టివ్.. మొబైల్ స్విచాఫ్ అయిపోయింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. కాగా, అతడిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మొబైల్ నెంబర్ ఆధారంగా నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీవీ చూస్తుండగా కనిపించిన చిన్న రంధ్రం !! పరిశీలించి చూస్తే మైండ్ బ్లాంక్ !!

మరోసారి దిమ్మతిరిగిపోయింది !! రీ-రిలీజ్‌ లోనూ.. కోట్లు కుమ్మరించింది

అరేబియన్‌ దిగ్గజం నయా రికార్డ్‌.. టీ20ల్లో తొలి బౌలర్‌గా బ్రావో చరిత్ర

Macherla Niyojakavargam: మాసు.. క్లాసు.. క్రాస్ బ్రీడే మాచర్ల

Laal Singh Chaddha: ఘోరం.. 180కోట్లకు 10 కోట్లేనా !! ఇక ఆమీర్ పని ఖతమేనా ??

 

Published on: Aug 14, 2022 09:32 AM
Loading...
Unable to load recommendations.
Follow Us