ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

Updated on: Mar 19, 2026 | 2:10 PM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో బుధవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మూడు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనను ఇండోర్ కలెక్టర్ శివం వర్మ అధికారికంగా ధృవీకరించారు.

స్థానిక సమాచారం ప్రకారం, ఈ భవనం మనోజ్ అనే వ్యాపారవేత్తకు చెందినది. ప్రమాదానికి గల ప్రాథమిక కారణం ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ అని తెలుస్తోంది. ఇంటి బయట ఈవీ వాహనాన్ని ఛార్జింగ్ కోసం ప్లగ్ చేసిన సమయంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. మంటలు క్షణాల్లో వ్యాపించి, చూస్తుండగానే మూడు అంతస్తుల భవనాన్ని చుట్టుముట్టాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో పది మందికి పైగా ఉన్నట్లు సమాచారం. దట్టమైన పొగ, మంటల మధ్య చిక్కుకున్న వారిలో ముగ్గురిని రెస్క్యూ టీమ్ విజయవంతంగా రక్షించగలిగింది. దురదృష్టవశాత్తూ ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేవలం షార్ట్ సర్క్యూట్ వల్లనే ఇంతటి భారీ ప్రమాదం జరిగిందా? లేక భవనంలో భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతుల కుటుంబాల్లో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది.

మరిన్ని వీడియోల కోసం :

ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో

బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

 

Follow Us