చేసేది భిక్షాటన.. ఏడాదికి రూ.20 లక్షలకు పైగా సంపాదన
ఇండోర్‌లో లక్షల రూపాయలు కూడగట్టిన ఓ భిక్షగత్తె తాజాగా పోలీసులకు చిక్కింది. ఇండోర్‌ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చే కార్యక్రమంలో భాగాంగా తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఆ మహిళ పట్టుబడింది. విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని విస్తుపోవడం పోలీసుల వంతైంది. ప్రతి 45 రోజులకు ఆమె సంపాదించిన 2.5 లక్షల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయలను తన పుట్టింట్లో ఉన్న ఇద్దరు పిల్లల కోసం పంపిస్తుందట. మరో రూ. 50 వేలను పిల్లల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తుందట.
ఇండోర్‌లో లక్షల రూపాయలు కూడగట్టిన ఓ భిక్షగత్తె తాజాగా పోలీసులకు చిక్కింది. ఇండోర్‌ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చే కార్యక్రమంలో భాగాంగా తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఆ మహిళ పట్టుబడింది. విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని విస్తుపోవడం పోలీసుల వంతైంది. ప్రతి 45 రోజులకు ఆమె సంపాదించిన 2.5 లక్షల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయలను తన పుట్టింట్లో ఉన్న ఇద్దరు పిల్లల కోసం పంపిస్తుందట. మరో రూ. 50 వేలను పిల్లల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తుందట. మిగతా సొమ్మును ఆమె తన వ్యక్తిగత అవసరాలకు ఖర్చుపెడుతుందట. అప్పటికే నోరెళ్లబెట్టిన పోలీసులకు ఆ భిక్షగత్తె మరో షాకిచ్చింది. ఈ వృత్తిలోనే ఆమె భర్త, చెల్లెలు, తమ ఇద్దరు పెద్ద పిల్లలు కొనసాగుతున్నట్లు తెలిపింది. ఈ కుటుంబం ఇండోర్ నుంచి ఉజ్జయినికి వెళ్లే మార్గంలో వేర్వేరు కూడళ్లలో భిక్షాటన చేస్తున్నట్లు చెప్పింది. భిక్షగత్తెను అదుపులోకి తీసుకున్న సమయంలో ఆమె దగ్గర రూ.19,200 నగదు లభ్యమైందని ఇండోర్ పోలీసులు తెలిపారు. ఆమె ఏడాదికి రూ.20 లక్షలకు పైగానే సంపాదిస్తుందని అంచనా వేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాకిస్తాన్ రాజకీయ సంక్షోభం కొలిక్కొస్తుందా ??
మారథాన్ ప్రపంచ రికార్డు విజేత దుర్మరణం
పూణె ప్రజలను హడలెత్తిస్తున్న దోమల సుడిగాలి