IndiGo: ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలికి వింత అనుభవం.. వీడియో.
సాధారణంగా ఆటోలు, కార్లు, బస్సుల్లో ప్రయాణిస్తుంటాం. కొన్ని సార్లు బస్సులో, రైల్లో సీట్లు విరిగిపోయి ఉండటం, లేదా సీటు కుషన్ పాడైపోయి ఉండటం చూస్తుంటాం. కానీ, విమానంలో ప్రయాణించే వారికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి..వినడానికి వింతగా అనిపించినా నిజంగా అలాంటి ఘటనే జరిగింది..ఇండిగో సంస్థకు చెందిన ఓ విమానంలో ఇలాంటి దృశ్యం వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా ఆటోలు, కార్లు, బస్సుల్లో ప్రయాణిస్తుంటాం. కొన్ని సార్లు బస్సులో, రైల్లో సీట్లు విరిగిపోయి ఉండటం, లేదా సీటు కుషన్ పాడైపోయి ఉండటం చూస్తుంటాం. కానీ, విమానంలో ప్రయాణించే వారికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి..వినడానికి వింతగా అనిపించినా నిజంగా అలాంటి ఘటనే జరిగింది..ఇండిగో సంస్థకు చెందిన ఓ విమానంలో ఇలాంటి దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఇండిగో విమానంలో ప్రయాణించేందుకు వచ్చిన నాగ్‌పూర్‌కు చెందిన సాగరిక పట్నాయక్‌కు ఊహించని షాక్ తగిలింది. తనకు కేటాయించిన సీటుకు కుషన్ లేకుండా ఉంది. దాంతో ఆ ప్రయాణికురాలు ఒక్కసారిగా అవాక్కైంది. ఏం చేయాలో అర్థంకాక.. ఇక్కడ ఎలా కూర్చుంటారంటూ విమానంలో గందరగోళం సృష్టించింది. దాంతో వెంటనే అలర్ట్ అయిన విమాన సిబ్బంది మరొక కుషన్‌ను తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించింది.. దీనిపై సదరు మహిళ భర్త సుబ్రతా పట్నాయక్ ఎక్స్ పోస్ట్ ద్వారా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఫిర్యాదు చేశారు.
ఇండిగో విమానంలో ప్రయాణించేందుకు తన భార్య సాగరికకు టిక్కెట్లు బుక్ చేసినట్లు సుబ్రతా పట్నాయక్ తెలిపారు. సాగరికకు ఎయిర్‌లైన్స్ కిటికీ దగ్గర సీటు నంబర్ 10ఎ కేటాయించిందనీ అయితే ఫ్లైట్ ఎక్కిన సాగరికకు సీట్‌పై కుషన్ కనిపించలేదని చెప్పారు. దాంతో ముందుగా కాస్త కంగారుపడిన సాగరిక చుట్టూ చూసిందని ఎక్కడైనా సీటు కుషన్ పడిపోయి ఉంటుందని భావించి చుట్టుపక్కల వెతికిందని కానీ కుషన్ దొరకలేదనీ తెలిపారు. ఆ సమయంలో విమానంలో ప్రయాణికుల బోర్డింగ్ కొనసాగుతోందనీ ఫ్లైట్ ఎక్కిన తన భార్య మాత్రం మధ్యలో నిలబడాల్సి వచ్చిందని అతడు వాపోయాడు. తరువాత సిబ్బంది వేరొక కుషన్ తెచ్చి పెట్టారనీ, విమానం టేకాఫ్‌కు ముందుగానే.. విమానాన్ని పూర్తిగా ఎందుకు చెక్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్‌గా మారిన పోస్ట్‌పై ఇండిగో యాజమాన్యం స్పందించింది. కొన్నిసార్లు సీటు కుషన్ దాని వెల్క్రో నుండి వేరు పడుతుందని దాన్ని క్రూ మెంబర్ సరిచేస్తుంటారని ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని మెరుగైన సేవలందిస్తామని పేర్కొంది. అయితే అజాగ్రత్తగా వ్యవహరించడం విమాన సిబ్బందికి సర్వసాధారణమైందని నెటిజన్లు సీరియస్‌గా కామెంట్లు పెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.