black magic: తెల్లవారి తలుపు తీయగానే గుమ్మం ముందు షాకింగ్ సీన్.. క్షుద్రపూజల కలకలం.
రాజాం పట్టణంలోని అమ్మవారి కాలనీ రెండో లైన్ లో జరిగిన ఈ క్షుద్రపూజలు పట్టణవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తెల్లవారుజామున నిద్ర లేచి ఇళ్లలో నుండి బయటకు వచ్చిన స్థానికులు క్షుద్ర పూజలను చూసి భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు. ఈ క్షుద్రపూజలు కారణంగా ఎవరికి ఎలాంటి కీడు వాటిల్లుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఈ క్షుద్రపూజల వల్ల తమకు ఎలాంటి హానీ కలగకూడదని పట్టణవాసులు
విజయనగరం జిల్లా రాజాంలో అర్ధరాత్రి క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఇళ్ల మధ్యలో క్షుద్ర పూజలు చూసి జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంటినుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. పిల్లలు సైతం పాఠశాలకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఓ మహిళ తెల్లవారుతూనే వాకిలి ఊడ్చేందుకు గేటు తీసి బయటకు రాగానే గుమ్మం ముందు ముగ్గు, పసుపు, కుంకుమ, కోడిగుడ్లు, ఎండుమిర్చి, నిమ్మకాయలు కనిపించాయి. రాజాం పట్టణంలోని అమ్మవారి కాలనీ రెండో లైన్ లో జరిగిన ఈ క్షుద్రపూజలు పట్టణవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తెల్లవారుజామున నిద్ర లేచి ఇళ్లలో నుండి బయటకు వచ్చిన స్థానికులు క్షుద్ర పూజలను చూసి భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు. ఈ క్షుద్రపూజలు కారణంగా ఎవరికి ఎలాంటి కీడు వాటిల్లుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఈ క్షుద్రపూజల వల్ల తమకు ఎలాంటి హానీ కలగకూడదని పట్టణవాసులు పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్లి పూజలు ప్రత్యేక జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి స్థానికులను ఆరా తీశారు. అందుబాటులో ఉన్న సిసి పుటేజ్ పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే క్షుద్రపూజలు బూటకమని ఎవరూ వాటిని నమ్మవద్దని అంటున్నారు జన విజ్ఞాన వేదిక సభ్యులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...